మందు లేదు మాకు లేదు
మనువాడే సోకు లేదు
ఉండు ఉండు అంటావే పిల్లా
నే ఉండి ఏంజేతునే మల్లా...?
ఉలుకు లేదు పలుకు లేదు
కలుసుకోను పిలుపు లేదు
ఉండు ఉండు అంటావే పిల్లా
నే వుండి ఏం జేతునే మల్లా. ?
మాట లేదు మంతి లేదు
ఆటలాడ బంతి లేదు
ఉండు ఉండు అంటావే పిల్లా
నే వుండి ఏం జేతునే మల్లా. !
ఆట లేదు పాట లేదు
కూడి ఆడు చోటు లేదు
ఉండేది ఎందుకు పిల్లా
తిండేది విందుకు మల్లా.?
అచ్చట లేదు ముచ్చట లేదు
మచ్చిక చేయ వచ్చుట లేదు
ఇక ఉండేది ఎందుకే భామా
నే పండేది ఎందుకు ఓ లేమా?
అందం లేదు చందం లేదు
పెనవేసుకోను బంధం లేదు
నేవచ్చి చేసేదేమున్నది పిల్లా
గిచ్చి చూసేదేమున్నది మల్లా !
చదువు లేదు సంధ్య లేదు
చాకచక్యం అసలు లేదు
ఎలా నెట్టుకొస్తావే పిల్లా
కట్టుకోను నీవింకా మల్లా !
ఇంపు లేదు సోంపు లేదు
చంప ఆనిచ్చు తెంపు లేదు
నే ఉండి ఏం చేతునే పిల్లా
నీ అండ నాకు లేక మల్లా !
వగరులేదు పొగరులేదు
వగలు పోవు అగరులేదు
ఇక వచ్చి ఏం చేతు పిల్లా
నీవేమో కొడతావులే జెల్లా!
వయసు లేదు మనసు లేదు
వాయి వరుస సరసం లేదు
నేను వచ్చి ఏం జేతు పిల్లా
వస్తేను వేస్తావు అడ్డు పుల్లా!
గిల్లి గిచ్చు ఆట లేదు
పొద్దు పుచ్చు పాట లేదు
ఎలాగా వచ్చి ఉందు పిల్లా
చలాకిగా నేనుందు మల్లా!
కట్టు లేదు బొట్టు లేదు
కన్ను కొట్టు పట్టులేదు
ఎన్నాళ్ళు ఉండేది పిల్లా
ఎన్నెల్ల పండేది నేమల్లా !
ఇల్లు లేదు పొల్లు లేదు
అలికిడుండు గల్లి లేదు
వచ్చి ఎలా ఉందునే పిల్లా
గిల్లిగిచ్చాడకుండా మల్లా !
ఆటు లేదు పోటు లేదు అక్కడ
దాగుడుమూత ఆడలేను పిల్లా
దండాకోర్ వీడలేను మరి మల్లా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి