పరలోక ప్రాప్తి- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఈ ప్రపంచంలోకి వచ్చిన మానవుడు  తన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి తన పద్ధతిలో పరిస్థితులను  ఏర్పాటు చేసుకుంటాడు  తనను కని పెంచిన తల్లిదండ్రులను  విద్యాబుద్ధులు నేర్పిన  గురువులు  సహ ధర్మచారినిగా తనకు సకల సౌకర్యాలు అందిస్తున్న భార్యను  తన సంతానాన్ని తప్ప మిగిలిన ప్రపంచం ఏది తనకు పట్టదు  వీరంతా సుఖంగా ఉండడానికి ఏం చేయాలి  అన్న ఆలోచన తప్ప  మరొకటి లేదు  ఉండడానికి ఇల్లు శరీరాన్ని కప్పుకోవడానికి బట్ట  జీవితాన్ని గడపడానికి ఆహారం ముఖ్యం  వాటిని సంపాదించే పనిలో  రకరకాల  పద్ధతులను అవలంబించడం  వాటిలో కొన్ని  జయప్రదం కావచ్చు  మరి కొన్ని కాకపోవచ్చు  దానివల్ల వాడికి నిరాశే మిగలవచ్చు. ఇది మామూలుగా ప్రతి ఒక్కరు ఆలోచించే విషయం.
మనిషి ఈ లోకంలో చేసేది ఏమీ లేదు  పరలోకంలోనే ఉన్నది అని చెప్పే వ్యక్తుల మనసులో భావాన్ని శంఖించడం తప్పు అని చెప్తున్నాడు వేమన. సుఖము అనేది శరీరానికి సంబంధించినది  తినడం తాగడం వల్ల వచ్చే  సుఖం సుఖం కాదు  మనసుకు సుఖం  కావాలి  ఆత్మను పరిశుద్ధంగా ఉంచాలి  కనుక అతను చేయవలసిన పని ఏమిటి అని ఆలోచించి  ఏకాంతంలో  ఆనాటి విశ్వామిత్రులకు వచ్చిన అనుమానాలన్నీ ఇతనికి వస్తాయి  మనసులో అనేక పద్ధతులలో ఆలోచనలు చేసి  ఏ మార్గాన్ని అనుసరిస్తే మనం అసలు మార్గంలో కి పెడతాం  ఎవరి ద్వారా శిక్షణ తీసుకుంటే సరిపోతుంది  సుఖాన్ని  పొందడం అనేది  వ్యక్తిగతమా  సామాజిక మా  అని కూడా ఆలోచించి  మంచి మార్గాన్ని నిర్ణయించుకుంటాడు. ఆత్మ అంటే ఏదో తెలియాలి  అని దాని కోసం ప్రయత్నం చేస్తాడు  పరతత్వాన్ని సాధించడానికి  ఈ లోకంలో ఈ జీవితం  మనకు ప్రకృతి ఇచ్చిన వరం  ఆ వరాన్ని సక్రమంగా వాడుకోవాలి  అని నిర్ణయించుకొని  మనసును స్వాధీనం చేసుకోవడం కోసం  ప్రయత్నాలు చేస్తూ ఉంటే అనేక అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి  వాటిని అన్నిటినీ ఒక్కొక్క దానిని ఒక్కొక్క రకంగా స్వాధీన పరుచుకుంటూ  శరీరంలో ఉన్న ఆరు చక్రాలను  తన అధినంలోకి తెచ్చుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో  వాడు తప్పకుండా సుఖాన్ని అనుభవిస్తారు  పరలోకంలో ఏ  సుఖాలు ఉన్నాయని భ్రమిస్తున్నారు అవన్నీ ఇక్కడే ఈ లోకంలోనే తాను అనుభవించడానికి అవకాశం ఉంది  అని నిర్ధారిస్తున్నారు వేమన  వాడు రాసిన పద్యం.

"ఇహము విడువ ఫలము యింపుగ గలరని మహిని బలుకు వారి మతము కల్ల  ఇహములోన బరమునెసగుట గానరో..."


కామెంట్‌లు