1936 లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాట్రగడ్డనారాయణ రావు గారు ఎమ్మెల్యేగా నిలుచున్నప్పుడు తేలప్రోలు వచ్చారు వారి మీద నిషేధపు ఉత్తర్వులు ఉండటం వల్ల వారు మాట్లాడకుండా జగన్నాథ రావు గారితో ఉపన్యాసం ఇప్పించారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన నారాయణరావు గారు పోటీ చేస్తే కట్ట మంచి కుళందర రెడ్డి గారు జస్టిస్ పార్టీ తరఫున పోటీ చేశారు కాంగ్రెస్ తరపున ఆరుమళ్ళ సుబ్బారెడ్డి శనగల విశ్వనాథరెడ్డి గుంటక పుల్లారెడ్డి వింత అప్పిరెడ్డి వింత నర్సారెడ్డి ప్రచారం చేశారు కట్టమంచి రామలింగారెడ్డి గారికి తమ్ముడు అవుతాడు కుళందర్ రెడ్డి వారి తరఫున వింత వెంకటరెడ్డి (మెంబర్) గారు పోలారెడ్డి రామిరెడ్డి వింత మల్లారెడ్డి గారు ప్రచారం చేశారు. 1939 వరకు విశ్వనాథరెడ్డి పుల్లారెడ్డి అప్పిరెడ్డి బొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు జాతీయోద్యమ కార్యకర్తలుగా పనిచేశారు రైలు ఆపిన సందర్భంగా విశ్వనాథరెడ్డికి గన్నవరం జైల్లో రెండు నెలలు శిక్ష విధించారు. వారు జిల్లా కాంగ్రెస్ సెక్రటరీగా గుంటక పుల్లారెడ్డి గారిని పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్గా ఎన్నుకున్నారు వింత మల్లికార్జున్ రెడ్డి గారిని తర్వాత పిసిసి మెంబర్గా ఎన్నుకున్నారు 1949 నుంచి 52 వరకు విశ్వనాథరెడ్డి డే టెన్ యుగా కడలూరి జైల్లో 64-65 సికింద్రాబాద్ జైల్లో నిర్బంధించబడ్డారు 1997 నుంచి వృద్ధాప్యం వల్ల అనారోగ్య కారణాలవల్ల తాలూకా బాధ్యత నుంచి తప్పుకొని గ్రామ సభ్యునిగా తన జీవితాన్ని కొనసాగించారు. చిన్నతనంలోనే జాతీయ ఉద్యమ స్ఫూర్తితో గాంధీజీ పిలుపునందుకొని ఇంగ్లీష్ చదువులకు స్వస్తి చెప్పి హిందీ వ్యాప్తి కోసం వయోజన విద్యార్థులు పాటుపడుతూ కాంగ్రెస్ కార్యకర్తలను గాను ఒక మనిషిని
మరొక మనిషి దోచుకోవడాన్ని అంతం చేసేది కమ్యూనిస్టు పార్టీ అందరూ చేరి జీవితాంతం కృషి చేశారు. 1917లో జన్మించిన రెడ్డి గారు జీవితాంతం కమ్యూనిస్టు కార్యకర్తగా ప్రజాసంఘాల నిర్మాతగా సంవత్సరాల తరబడి అజ్ఞాతవాసాన్ని జైలు జీవితాన్ని గడిపారు రాజమండ్రి జైలు లోను తర్వాత కడలూరి జైలులో కాలం గడిపారు. ఆయన జీవితం చివరి వరకు పార్టీ కోసమే పనిచేసే కామ్రేడ్ అంటే విశ్వనాథరెడ్డి అన్న పేరు తెచ్చుకుని అంకితభావంతో పార్టీకి పనిచేసిన వ్యక్తి విశ్వనాథరెడ్డి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి