మా గ్రామంలో 1944 లో సాయిబు డాక్టరు అని పిలవబడే ఆయన ఉండేవారు ఆయన పేరు ఎవరికీ తెలియదు ఎస్ ఆర్ ముస్తఫా అన్నది ఆయన అసలు పేరు వైద్యం చేయడంలో ఆయనను మించిన వారు లేరు కాలక్రమేణా ఆంగ్ల వైద్యం కూడా చేసేవారు పేరంటాలమ్మ గుడి ప్రక్కన సత్రంలో వారి నివాసం ఆయనకు పక్షులను పెంచడం చిన్న చిన్న జంతువుల్ని పెంచడం సరదా బాతులు బడి కోళ్లు నిప్పుకోళ్ళు రకరకాలవి వారి ఇంట్లో పెంచేవారు మేం ప్రతిరోజు ఆ బాతులతో ఆడుకోవడానికి వెళ్ళడం కొన్ని కోళ్లు మా అంత ఎత్తు ఉండేవి మేము ఎలా ఆడితే అలా ఆడుకునేది మా వెంటపడేవి చిన్నపిల్లల ఆటలాగా జరిగేది వాటితో ఆడుతున్నంతసేపు మా పిల్లల అంత ఆడుకుంటున్నది చూస్తూ ఆయన ఎంతో మురిసిపోయేవారు డాక్టర్ గారు. వారి కుమారుడే ఇస్మాయిల్ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగాము ఒకే బడిలో చదువుకున్న నేను వాడు రాధాకృష్ణ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న కృష్ణమోహన్ కృష్ణ మేమంతా బాల్య స్నేహితులం అప్పటినుంచి ఏరా ఏరా అనుకుంటున్న స్నేహం కృష్ణ తన చదువు అయిన తర్వాత అమెరికా వెళ్ళాడు రాధా చదువైన తర్వాత వ్యవసాయం మీద దృష్టి మళ్లిగ్రామంలో చవకలో పొలం కొని అక్కడ వ్యవసాయం మొదలుపెట్టాడు కొంతకాలం జరిగిన తర్వాత చేతి డబ్బులు వదిలించుకుని తిరిగి మళ్లీ స్వగ్రామం చేరుకున్నాడు నేను ఆకాశవాణి కేంద్రంలో చేసిన తర్వాత ముగ్గురం చాలాసార్లు కలుసుకొని పాత విశేషాలన్నీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం మిగిలినవారు ఈర్షపడేంత స్నేహం మాది. తండ్రి మానవ రుగ్మతలను రూపుమాపడానికి చేతిలో స్టెత్ పట్టుకుంటే మానసిక పరిణతిని పెంపొందించడానికి ఇస్మాయిల్ కలాన్ని చేతబెట్టాడు కాకినాడలో తన గురువు పేరు తన పేరు ఒకటి కావడంతో తన పేరు స్మైల్ అని మార్చుకున్నాడు నాటి నుంచి నిన్న మరణించేంతవరకు ఆ కలం సిరా ఆగలేదు ఎస్.ఎస్.ఎల్.సి మాతోపాటు చదివి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం లైలా కళాశాలలో ఆంగ్ల భాష అధ్యాపకులుగా పనిచేసి ఏపీపీఎస్సీ ద్వారా ఏ సి టి ఓ గా ఎంపికై డిప్యూటీ కమిషనర్ హోదాలో కాకినాడలో పదవీ విరమణ చేసేంతవరకు నాకు అత్యంత సన్నిహితుడుగానే ఉన్నాడు హోదా పెరిగిన మా స్నేహాలలో ఎలాంటి అవాంతరం రాలేదు ఏరా ఒరేయ్ అంటూనే కాలం గడిచేది.
మన గన్నవరం...;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి