కోర్కెలు అనంతం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 మానవుడు భూమి మీదకు వచ్చిన తర్వాత  వయస్సు పెరుగుతున్న కొద్దీ  తన ఆలోచనలు పెరుగుతాయి అభిరుచులకు అంతులేదు  ఇది కావాలా అది కావాలా అని నిర్ణయించుకోవటం లోనే అతని  సగం జీవితం సరిపోతుంది  తనకు ఏది కావాలో  తెలియని స్థితి  దేనిని చూస్తే  దానిపైనే మనసు పడి దాని కోసం తాపత్రయ పడడం  ప్రతి మనిషికి సహజమైన స్థితి  దానిని దాటి వెళ్లాలంటే  వనరులు లేకుండా పోవాలి  అవి పోతే  మనసు ప్రశాంతంగా ఉంటుంది దేని పైన  దృష్టి మరల్చవలసిన అవసరం ఉండదు అలా చేయగలిగిన వ్యక్తులు మనకు దగ్గరలో ఎవరైనా ఉన్నారా అని ఆలోచించినట్లయితే  మనకే ఆ శక్తి లేనప్పుడు ఇతరులకు మాత్రం ఎలా ఉంటుందని అనుకోవాలి అని తనకు తానే సమర్ధించు కుంటాడు.
యవ్వన స్థితి వచ్చేంతవరకు  జిహ్వ చాపల్యంతో  తనకు కావలసినవి తినాలని  కోరుకుంటూ ఉంటది కొంటె వయసు వీరికి  తన చుట్టూ ఉన్న స్నేహితులతో కలిసి  రకరకాల ఆలోచనలు చేస్తూ  కాలక్షేపం చేస్తూ ఉంటారు  సమయాన్ని ఎలా  సద్వినియోగం చేసుకోవాలో తెలియని వయస్సు అది. దానితో అనేక దుర అలవాట్లు పడడం  ప్రత్యేకించి స్త్రీ సాంగత్యం  ఈ విషయంలో వేమన  తన జీవిత అనుభవాలను  పద్య రూపంలో మనకు అందించడా అనిపిస్తుంది. తనకిష్టమైన విశ్వద అన్న స్త్రీ వ్యామోహంలో  తన జీవితాన్ని అపఖ్యాతి  కిలోలై  జీవితాన్ని నాశనం చేసుకున్న సంఘటన మనకు తెలియజేశారేమో అనిపిస్తుంది  ఈ వయసులో  ఏదైనా ఒక స్త్రీని వలచి ఆమెతో సాంగత్యం ఏర్పడిన తర్వాత  ఆమెను మించిన మరొక అందగత్తె కనిపించినప్పుడు ఆమెను కోరుకోవడం  ఆమెను మించి మరొకరు ఎవరైనా కనిపించినప్పుడు  భిన్నమైన పద్ధతిలో ఆకర్షించడం  అలవాటు చేసుకుంటాడు  అలా ఎంతకాలం  చేతిలో డబ్బు పూర్తిగా అవచేసుకున్నంతవరకు  అలా ఉంటాడు. తన చేతిలో చమురు ఎప్పుడు అయిపోయిందో ఆ మరుక్షణం ఆమె  తన చేతి నుంచి జారిపోవడం మొదలవుతుంది  ఆ తరువాత తెలుస్తుంది జీవితంలో ఎంత తప్పు చేసాము అని  ఆ చేసిన  అపరాధాన్ని సరి చేసుకోవడానికి  మోక్ష మార్గం తప్ప మరొకటి లేదు  అప్పుడు సిద్ధుడిగా మారతాడు అని చెబుతున్నాడు వేమన  ఆ పద్యాన్ని ఒక్కసారి చదవండి.


"ముండమోపి తోటి మునుగుచు తేలుచునుండగానె మోహముండెగాక నండబాయు వెనుక నాయాశలే లేవు..."


.

కామెంట్‌లు