మన గన్నవరం- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ వాడ,9492811322.
 ఒకరోజు అనుకోకుండా  మా గ్రామానికి రావడానికి జీపులో వస్తున్న సందర్భంగా  ప్రమాదవశాత్తు  చిన్న వయసులోనే  మరణానికి లోనయ్యాడు  తేలప్రోలు లో నేను రాధా స్మైల్ చేసిన అల్లరి అంత ఇంత కాదు అంతా కళ్ళ ముందు  కదలాడుతూనే ఉంది  ఒకటి రెండు రోజులు మిత్రులందరికీ  కాలక్షేపం చేసి  ఆనందాన్ని అనుభవించాలన్న కోరిక తీరకుండానే  తీరం దాటి వెళ్ళిపోయాడు  ఆప్త మిత్రుడు స్మైల్  రాధా కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది  డాక్టర్ బొమ్మా రెడ్డి రామ్ కోటిరెడ్డి మిగిలిన మా మిత్రులందరికీ  విషాదాన్ని మిగిల్చి వెళ్లిపోయాడు  అంటే విపరీతమైన ప్రాణం  ఈ వార్త విని పుస్తకావిష్కరణ సభకు వచ్చిన డాక్టర్ కే వెంకట్ రాజు గారు  వాడి మాటని జ్ఞాపకం చేసుకుంటూ  వాడి రచనల గురించి చెబుతూ ఎంత బాధ పడ్డారో చెప్పలేం  మాకు మా గ్రామానికి విషాదాన్ని మిగిల్చిన  ఓ వెలుగు మా స్మైల్.
ఎలిమెంటరీ స్కూల్లో తాను చదువుతున్నప్పుడు  రావు గారి స్కూల్లో తనను చేర్చారు వాళ్ళ నాన్నగారు  రావు గారు బ్రహ్మసమాజికులు ఆయన భార్య హనుమాయమ్మ గారు  మమ్మల్ని కన్నబిడ్డ ల్లాగా చూసుకునేది  వారి ఆదర్శ వివాహం  నాకు వివాహాలపై మంచి అవగాహన కల్పించింది కులాలకు మతాలకు అతీతంగా  మనసులు కలిసిన మనుషుల్లా జీవించడం కోసం  ఈ వివాహం అన్న అభిప్రాయం కలిగింది  ఒక సందర్భంలో క్లాసులో నేను  ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే కృష్ణవేణి  నా సహాధ్యాయి నన్ను చెంప దెబ్బ కొట్టింది  ఆ తరువాత  సమయం కోసం ఎదురుచూస్తున్నా  తాను చెప్ప లేనప్పుడు నేను నా కక్షంతా తీర్చుకుంటూ గట్టిగా కొట్టేసరికి  వాళ్ల తాత ఏరా నాన్న ఆడపిల్లను అలా కొట్టవచ్చా  అన్న మాట నా మనసులో శూలం లాగా గుచ్చుకుంది.
ఆ సంఘటన వల్ల అబ్బాయి పుట్టినప్పుడు అన్న కవిత ఆవిర్భవించింది. మా నాన్న మరణించినప్పుడు ఊరి ప్రజలంతా మా ఇంటి దగ్గరే ఉన్నారు  వారి అభిమానం మమ్మల్ని ఎన్నో కష్టాల నుంచి గట్టు ఎక్కించింది అప్పటి ఊరిలో ఆత్మీయత అభిమానం తలుచుకుంటే కృతజ్ఞతా భావంతో కళ్ళనీడు నిండుతాయి  అన్నాడు  స్మైల్  వాడికి వేమన గ్రంథాలయం అంటే ప్రాణం  అక్కడకు వెళ్లకుండా ఒక రోజు కూడా గడపలేడు  పత్రికలు చదవటం పుస్తకాలు చూడడం మాత్రమే కాకుండా  అక్కడికి వచ్చి ఆప్యాయంగా పలకరిస్తూ  మనస్ఫూర్తిగా మాట్లాడే మనుషుల మనస్తత్వాలు వాడికి ఇష్టం  మా ఊర్లో కేశవరెడ్డి గారని  చెస్ లో ఛాంపియన్  దానిలో మెళకువలన్ని  ఇస్మాయిల్ కు నేర్పాడు  ఆయనకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పాడో చెప్పలేము.

కామెంట్‌లు