మన గన్నవరం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 పాటి బండ శ్రీమన్నారాయణ గారు ఉదయభారతీ  గురుకులంలో ఉద్యోగం చేసి  తర్వాత  ప్రైవేటు స్కూలు పెట్టి ఆ తర్వాత హై స్కూల్లో చేశారు. వారికి బాగా నచ్చిన  వ్యక్తులం  మా బసవలింగం, నేను ఇంటికి పిలిపించి  అనేక విషయాలు  సాహిత్య పరంగా  చెప్పేవారు తర్వాత మా ఇద్దరిని  తెలుగు పండితులు  బూర్గుల పురుషోత్తమ శాస్త్రి గారిని  సంప్రదించి వారి వద్దకు పంపించారు మేము ఎక్కువగా సాయంత్రం పూట వారింటికి వెళ్లి  వారు చెప్పినవన్నీ జాగ్రత్తగా వ్రాసుకునేవాళ్ళం  శాస్త్రి గారు వారి భార్య సనాతనులు అయినా  అభ్యుదయ భావాలతో ముందుకు నడిచే కుటుంబం  ఆమె కూడా మమ్మల్ని తమ బిడ్డల్లా చూస్తూ  మాకు ఏది కావాల్సివచ్చిన ఇంట్లో పిల్లలు చూసేవాడు  నేను రెడ్డి బసవలింగం కుమ్మరి అన్న విషయాలు వారికి బాగా తెలుసు. తెలుగులో మంచి ప్రతిభ కలిగిన బసవలింగాన్ని  ఆంధ్ర భాషకు చాలా దగ్గరగా ఉన్న కన్నడ భాషను కూడా నేర్చుకోమని  సలహా ఇవ్వడంతో పాటు  కన్నడం తెలుగు సినిమా ఉపాధ్యాయుడిగా  బసవలింగాన్ని అక్కడ  విద్యార్థిగా చేర్చారు  ఉపాధ్యాయుని  చేయూత  బసవలింగం స్వయంకృషి వల్ల  కన్నడ భాష పై మంచి  పట్టు సాధించాడు  ఆ తర్వాత పురుషోత్తమశాస్త్రి గారి దగ్గర సంస్కృతం నేర్చుకుని  మా రంగారావు మాస్టర్ గారి దగ్గర హిందీ  తర్వాత ప్రాకృతం ఉర్దూ భాషలో కూడా  పూర్తి  పట్టు సాధించి  మంచి జ్ఞానాన్ని సంపాదించాడు  మధ్యలో కవితలు రాయడం  తన భాషా పాండిత్యాన్ని ప్రదర్శించడమే కాకుండా  సామాన్య ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో తన కవితలు సాగుతూ ఉండేవి. తరువాత బెంగుళూరు వెళ్లి  తాను నేర్చుకున్న కన్నడాన్ని  ఉపయోగించి అక్కడ సామాన్య  వ్యక్తులు వారి  జీవన విధానం  మొత్తం అధ్యయనం  చేసి ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని కూడా తయారు చేశారు  అతను అక్కడ  కన్నడ భాషలో ఉపాధ్యాయునిగా చేరి  అక్కడ పిల్లలతో తన పాఠాలు చెప్పడమే కాకుండా  వారి వద్ద నుంచి అనేక విషయాలు అనేక పదాలు  నేర్చుకున్నాడు  జీవితం మొత్తం నిత్య విద్యార్థిగానే  గడిపాడు  స్వగ్రామం తేలప్రోలు అన్న  నాలాంటి స్నేహితుడు అన్న  తనకు ప్రాణం  మధ్య మధ్యలో వచ్చి మాతో కాలక్షేపం చేసి వెళుతూ ఉండేవాడు  స్నేహానికి ప్రాణమిచ్చే తత్వం  మన సంస్కృతికి  సంప్రదాయానికి  కట్టుబడి జీవితాన్ని తీర్చిదిద్దుకున్నవాడు  నా ఆత్మీయుడు అని చెప్పుకోవడానికి గర్వంగానే ఉంటుంది  భౌతికంగా దూరమైన  తన మాటలు నేటికీ జ్ఞాపకమే.

కామెంట్‌లు