వనపర్తి అడవిలోకి సాయంత్రం వేళ మర్కటం అనే కోతి "సాయం సంధ్య వేళయింది రారమ్మని నా ఇల్లు పిలుస్తోంది" అని పాడుకుంటూ వస్తోంది.అంతలో శేషం అనే కుందేలు ఏడుస్తూ కనబడింది చాలా ఆదుర్దాగ అనిపించి దగ్గరికి వెళ్లి మిత్రమా ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగింది. మరకటాన్ని చూసిన శశమా అనే కుందేలు కౌగిలించుకుని బావురు మంది.
శశమా తల నిమురుతూ ఏమైంది మిత్రమా అని అడిగింది.
మిత్రమా మా పూర్వీకులు కొందరు చంద్రుడి పై నివసిస్తున్నారు కదా ఈ మానవులు ఇక్కడ మా జాతిని అంతరింప చేసిన అక్కడ ఉన్న మా జాతి సంతోషంగా ఉంటుంది అనుకునేదాన్ని, ఈ మానవులు చంద్రయాన్ _3పేరిట చంద్రుడిపై కూడా మకాం పెట్టారంట ఇప్పుడే కాకి మిత్రుడు చెప్పాడు. ఈ స్వార్ధమానవులు అక్కడి మా వారిపై దాడి చేసి మా జాతిని అంతరింప చేస్తారని చాలా బాధగా ఉంది అంటూ కళ్ళొత్తుకుంది.
మిత్రమా ఇన్ని రోజులు మానవులు చెప్పినట్లు మనం అనుకున్నట్లు చంద్రుడిపై ఎటువంటి మర్రిచెట్టు గాని కుందేలు గాని లేవంటా... పైగా అక్కడున్నదంతా సన్నని దుమ్మట నీటి జాడ కూడా కనపడలేదని నీటిజాడని కనిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఇస్రో శాస్త్రవేత్తలు టి.వి లో చెప్తుంటే విని వస్తున్నా..
ఇదంతా చెట్టు పైన కూర్చొని వింటున్న పావురం ఈ మానవులు చాలా తెలివైన వారు..ఏదైనా కనిపెట్టగలరు..కాని అంతే స్వార్థపరులు వారి సౌఖ్యం కోసం వేటినైనా నాశనం చేసేస్తారు.వీరికి మేధస్సుతో పాటు కాస్త సహనం ,భూతదయ కూడా అలవడితే జీవనము మరింత అందంగా సాగించేవారు మనతో కలిసి అంది.అవునన్నట్లు శశమ తల ఊపింది.
మిత్రమా శశమ ఇన్నాళ్ళు మానవులు ఊహించి చెప్పినది నిజమని నమ్మి సంతోషపడ్డాం.ఇప్పుడు వారి ఊహలు తప్పని వారి పరిశోదనలే ఋజువు చేశాయి.ఊరికే దిగులు పడక సంతోషంగా ఉండటం నేర్చుకో!ఈ క్యారెట్ తిను అని అందించింది మర్కటం.
హమ్మయ్యా! అయితే మా జాతికి ఏం ప్రమాదం లేదన్నమాట అంటూ క్యారెట్ అందుకుంది.
మర్కటం,కాకి,పావురం సంతోషించాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి