రాత్రి;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
రాత్రి నిద్రపోలేదు
కమ్మిన చీకటిలో 
కనులు మెరిసే సుదీర్ఘ మెలకువలో 

మధుర గాయాల శయ్యపై 
అటు పొర్లి ఇటు దొర్లే నిస్పృహ 
వత్తిడి వ్యాకులత పట్టిన నెత్తి 

రాత్రికి మనశ్శాంతే కదా
ఆత్మీయ బతుకు నేస్తం
కవితల నది సాగే ఔషధగీతం

ఆరోగ్య సోపాన 
నిశితో జతై నింగి చేరే
జీవిని వీడిన నిద్ర గగన కుసుమం


కామెంట్‌లు