వాట్స్అప్ మిత్రులు, సమూహాలు
ఇన్ స్టా లో కథలు
ట్విట్టర్ లో పోస్ట్ లు
ఫేస్బుక్ లో పరిచయాలు
యూ ట్యూబ్ లో ఛానల్ లు
ఇలా ఎన్నో నెట్ వర్క్ లు
స్నేహితులకి
సలహాలకు
కొదవే లేదు
డిజిటల్ ప్రపంచం లో
మరి ఇంత మంది
ఉన్నా కూడా
మనసుకి ధైర్యం
చెప్పే వాళ్ళు లేరా
అసరా ఇచ్చే వాళ్ళు లేరా
ఎందుకు ఈ విద్యార్థులు
యువ జీవితాలను
బలవంతం గా
ముగిస్తున్నారు
ఎక్కడ ఉంది లోపం
ఏం చేస్తే ఈ జీవితాలని
వికసింప చెయ్య గలము
సోషల్ మీడియా లో
'సోషల్ ' కేవలం
ఎండమావి యేనా.
నాకు అర్ధం కావటం లేదు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి