అనగనగా ఒక ఊరిలో అందమైన పూల తోట ఆ తోటలో రంగురంగుల పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వులు ఎంతో సుగంధం ఉంటాయి. ఆ పువ్వుల పేర్లు గులాబి మల్లె చామంతి బంతి మరియు చాలా పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వులకు ఒక తోట యజమాని ఉన్నాడు. యజమాని పేరు రాములు. తోటలో పనిచేసేవారు రంగయ్య పుల్లమ్మ వారు పొద్దున్నే తోటకు వచ్చి తోట పనులు చేస్తారు. నీళ్లు పోస్తూ ఉంటారు.వాళ్లు ఎండలో కష్టపడి తోటకు కాపరిగా ఉంటారు. వాళ్లకు ఒక కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు కొడుకు పేరు రవి, కూతురు పేరు లక్ష్మీ.వాళ్ల పిల్లలను బడికి పంపుతారు. రంగయ్య పుల్లమ్మ. ఒకరోజు వాళ్ల అమ్మ నాన్నకు జ్వరం వచ్చింది. అప్పుడు తోట యజమాని వచ్చి రంగయ్య పుల్లమ్మ మీరు తోటకి వెళ్లి నీళ్లు పొయ్యరా అని యజమాని అన్నాడు. పిల్లలు మా అమ్మ నాన్నకు జ్వరం వచ్చింది. యజమాని గారు మేము తోటకి వెళ్లి నీళ్లు పోయొచ్చా అని యజమానిని రవి లక్ష్మీ అడిగారు. సరే పిల్లలు మీ అమ్మ నాన్నకు జ్వరం వచ్చింది కదా మీరు తోటకు వచ్చి నీళ్లు పొయ్యండి. సరే యజమాని గారు అని రవి లక్ష్మీ అన్నారు. వాళ్లు నీళ్లు తోటకు పోశారు. వాళ్ల అమ్మా నాన్నకు జ్వరం తగ్గింది. కదా మీరు ఇక బడికి వెళ్ళండి అని తల్లిదండ్రులు అన్నారు. వాళ్లు ప్రతి రోజు బడికి వెళ్లి చదువుకుంటున్నారు. అమ్మా నాన్నకు పనులు చేస్తున్నారు.
నీతి, తల్లిదండ్రులను మనం కష్టపెట్టవద్దు. వాళ్లకు పనిలో సహాయం చేయాలి. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనం ఈ చిన్న చిన్న పనులు చేయ్యాలి.
కృతజ్ఞతలు.
నీతి, తల్లిదండ్రులను మనం కష్టపెట్టవద్దు. వాళ్లకు పనిలో సహాయం చేయాలి. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనం ఈ చిన్న చిన్న పనులు చేయ్యాలి.
కృతజ్ఞతలు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి