కొడవటూర్ అనే ఊరిలో ఒక పేద కుటుంబం నివసించేది.వారికి ఒక అమ్మాయి పేరు గీత. వాళ్ళ ఊర్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది.ఆ అమ్మాయికి చదువంటే ప్రాణం.ఆమె ఎంతో శ్రద్ధగా, బుద్ధిగా చదువుకునేది. పాఠశాలలో ఉపాధ్యాయులందరూ గీతను మెచ్చుకునేవారు.బాగా ప్రోత్సహించేవారు.తరగతి పరీక్షలలోనే కాకుండా వ్యాసరచన,ఉపన్యాసాల పోటీలలో పాల్గొని బహుమతులు పొందేది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో మొదటి బహుమతి గెలుస్తుంది.బహుమతులు ఇవ్వడానికి పాఠశాలకు ఆ జిల్లా కలెక్టర్ గారు వస్తారు. ఉపాధ్యాయులు ఆ అమ్మాయి కుటుంబ పరిస్థితుల గురించి కలెక్టర్ గారికి తెలియజేస్తారు.
కలెక్టర్ గారు గీత చదువుకయ్యే ఖర్చులన్నీ నేను భరిస్తా అని సభాముఖంగా తెలియజేస్తాడు.ఆ రోజు నుండి గీత బాగా కష్టపడి చదివి పదవ తరగతిలో మొదటి స్థానంలో నిలుస్తుంది.కలెక్టర్ గారి సహాయంతో ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణిలో పాసవుతుంది.ఎంసెట్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకొని, పేరున్న ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేస్తుంది. పెద్ద కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం సంపాదిస్తుంది.
తనకు సహాయం చేసిన కలెక్టర్ గారిని కలుస్తుంది. నాలాంటి వాళ్లకు సహాయం చేయాలి ఉందని చెప్తుంది. గీత మంచి మనసుకు కలెక్టర్ గారు అభినందిస్తారు.ఉద్యోగం చేస్తూనే సెలవు దినాలలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నది.బాగా చదువుకున్న వాళ్లకు ఎవరో ఒకరు సహాయం చేస్తారు. అందుకే ప్రతి ఒక్కరు కష్టపడి చదువుకోవాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి