అనగనగా ఒక గ్రామం ఉండేది. రామవరం. ఆ గ్రామంలో ఒక చిన్న ఇంట్లో ఒక అమ్మ ,నాన్న, అక్క, తమ్ముడు, ఉంటారు. అమ్మ పేరు రాములమ్మ, నాన్న పేరు లింగయ్య, అక్క పేరు జ్యోతి, తమ్ముడు పేరు రాజు. వీళ్లంతా కుటుంబ సభ్యులు. రాజు జ్యోతి ఇద్దరు బడికి వెళ్తారు. రాములమ్మ నేమ్ కూరగాయలు అమ్ముతుంది. లింగయ్య పొలం పనులు చేస్తాడు. వాళ్లు ప్రతి రోజు పనులు చేస్తారు. వాళ్ల అమ్మాయికి గుండె ఆపరేషన్ చేయాలి. అమ్మానాన్న పొద్దంతా కష్టపడి పనులు చేస్తారు. వాళ్ల అమ్మాయి ఆపరేషన్ చేయకపోతే బ్రతకదు అని డాక్టర్లు చెప్పారు. ఒకరోజు జ్యోతి బడిలో కింద పడిపోయింది. అప్పుడు వాళ్ల అమ్మానాన్నలు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పుడు డాక్టర్లు మీ అమ్మాయికి ఆపరేషన్ చేస్తే బ్రతుకుతుంది అని డాక్టర్లు చెప్పారు. అప్పుడు రాములమ్మ లింగయ్య బిడ్డకు ఆపరేషన్ చేయించి మన బిడ్డని బ్రతికించుకోవాలి. అని రాములమ్మ లింగయ్య ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. రాములమ్మ కూరగాయలు గ్రామం మొత్తం తిరిగి అమ్ముతుంది. అయ్యా నా కూతురికి గుండె ఆపరేషన్ కి డబ్బులు కావాలి దయచేసి కూరగాయలు కొనండి అని రాములమ్మ అనుకుంటూ కూరగాయలు అమ్ముతుంది. మరి లింగయ్య వాళ్ళ పొలం పనులు కాకుండా వేరే వారి పొలం పనులు కూడా చేస్తున్నాడు. రాజు కూడా బడికి వెళ్లడం లేదు. అక్క ఆపరేషన్ కోసం రాజు కూలీ పనికి వెళుతున్నాడు. రాములమ్మ లింగయ్య వారు కష్టపడి కూరగాయలు అమ్మి. పొలం పనులు చేసి. రాజు కూలీ పనికి వెళ్లి ఆపరేషన్‌కు డబ్బులు కట్టారు. డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేశారు. జ్యోతి బ్రతికింది. రాములమ్మ లింగయ్య మా కూతురు మాకు దక్కింది మాకు అదే చాలు అని అన్నారు. రాజు మా అక్క అంటే నాకు చాలా ఇష్టం మా అక్క బ్రతికింది అని అన్నాడు. అందరూ కలిసి సంతోషంగా ఉన్నారు. జ్యోతి రాజు బడికి వెళుతున్నారు. లింగయ్య రాములమ్మ వారి పనుల్లోకి వెళుతున్నారు.
నీతి, తల్లిదండ్రులకు పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది. అందుకే తన కూతుర్ని లింగయ్య రాములమ్మ బ్రతికించుకున్నారు.
కృతజ్ఞతలు.
కుటుంబ ప్రేమ;- కె. ఉషశ్రీ - 9వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల-నీర్మాల.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి