ఆరోగ్యం కాపాడుకోండి.; కె. ఉషశ్రీ - 9వ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల- నీర్మాల
  అనగనగా ఒక గ్రామంలో ఇద్దరూ భార్యాభర్తలు ఉండేవారు. భార్య పేరు నర్సమ్మ, భర్త పేరు ఎల్లయ్య. వాళ్లు పొద్దంతా కష్టపడి వ్యవసాయం చేస్తారు. వాళ్లకు ఇద్దరూ కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు పేరు స్వాతి. చిన్న కూతురు పేరు అనూష. వీళ్లు పాఠశాలకు ప్రతిరోజు వెళ్తారు. నర్సమ్మ  పొద్దున్నే లేచి ఇంట్లో పనులు చేస్తుంది. తరువాత స్వాతి అనూష లేవండి తెల్లవారింది అని నర్సమ్మ అంటుంది. పిల్లలు ఇద్దరూ లేచి తయారు అయ్యి పాఠశాలకు వెళ్లారు. నర్సమ్మ, ఎల్లయ్య వెళ్లి వ్యవసాయం చేస్తారు. కానీ పంట చేతికి వచ్చినంక ధాన్యం అమ్ముతారు. ఆ డబ్బుతో మద్యం తాగుతాడు. నర్సమ్మ వద్దు అయ్యా మనం పిల్లల చదువు కోసం వాడుకుందాం అని నర్సమ్మ అన్నది. ఎల్లయ్య ప్రతిరోజు రాత్రి ఇలాగే మద్యం తాగి వస్తాడు. స్వాతి అనూష పాఠశాల నుండి వస్తారు. ఒకరోజు రాత్రి ఎల్లయ్య మద్యం తాగి ఇంటికి వస్తాడు. నాన్న మీ ఆరోగ్యం పాడైపోతుంది అని స్వాతి అనూష నాన్నని అంటారు. ఎల్లయ్య నేను ఇట్లానే తాగుతా అని అన్నాడు. స్వాతి అనూష ఎంత చెప్పినా ఎల్లయ్య వినలేదు. పొద్దున్నే లేచి ఎల్లయ్య పిల్లలతో ఇలా అన్నాడు. అమ్మా స్వాతి నువ్వు పోలీస్ కావాలి. అమ్మా అనూష నువ్వు టీచర్ కావాలి. అని స్వాతిని అనూషని ఎల్లయ్య పిలిచి అన్నాడు. స్వాతి అనూష  పాఠశాలకు వెళ్లి బాగా కష్టపడి చదువుకున్నారు. ఇలా కొన్ని సంవత్సరాలు అయ్యింది. వాళ్ల నాన్న అలాగే మద్యం తాగుతున్నాడు. ఆరోగ్యం దెబ్బ తిన్నది. స్వాతి ఏమో వాళ్ల నాన్న కోరిక ప్రకారం పోలీస్ అయ్యింది. అనూష కూడా టీచర్ అయ్యింది. నాన్న కోసం ఊరికి వచ్చారు. అప్పుడు నాన్న మంచంలో పడుకోవడం చూసి స్వాతి అనూష ఇద్దరూ బోరున ఏడ్చారు. ఎల్లయ్య అమ్మా మీరు చెప్పితే నేను వినలేదు. ఇప్పు ఇప్పుడు నా ప్రాణాల మీదికి వచ్చింది,అని ఎల్లయ్య అన్నాడు. అమ్మా స్వాతి అనూష ఇప్పటి నుండి ఎవరిని మద్యం తాగనివ్వకండి, అని ఎల్లయ్య అన్నాడు. స్వాతి అనూష మీరు అమ్మని బాగా చూసుకోవాలి అని అన్నాడు. అప్పుడు ఎల్లయ్య మరణించాడు. నర్సమ్మని స్వాతి అనూష ఉద్యోగాలు చేసుకుంటూ అమ్మను చూసుకుంటున్నారు. సంతోషంగా జీవిస్తున్నారు.
నీతి, మనం తల్లిదండ్రులకు మద్యం తాగవద్దు అని పిల్లలు చెప్పాలి. వినకపోతే ఎల్లయ్య లాంటి పరిస్థితి వస్తుంది. ప్రాణాలు కూడా పోతాయి. కుటుంబ సభ్యులు పిల్లలు ఆగమైపోతారు. ప్రాణాలు కాపాడుకోండి కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండండి.
కృతజ్ఞతలు.

కామెంట్‌లు