సూర్యుడు;- కొప్పరపు తాయారు
 పూర్వకాలంలో మనం. సూర్యునికి ఎంతో గౌరవం
ఇచ్చి  ఆది దేవుడు అని అనే వాళ్ళం.అందుకే  మన
వారాలు, ఆదివారం తో మొదలు.అదే సూర్యుడు
తోటి.ఆదివారం,సోమవారం ,మంగళవారం, బుధవారం,గురువారం,శుక్రవారం,శనివారం.
       అందుకే  గ్రహాలలో ముందు సూర్యుడే అందుకేఆయన శ్లోకం :జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిమ్ సర్వ పాపఘ్నం. ప్రణతోస్మి దివాకరం. !!
               ఇది ఆదిత్య శ్లోకం. ప్రతీ పూజ సూర్యభగవానుడి తో మొదలు.అంటే అగ్ని కి
ముందు మనం పూజ చేసి ఇంకా. ఎపని అయినా
ఆరంభించాలి.అందు వలన మనకి మంత్రబలం
మాట బలం ,మన నడత అన్నీ కూడా బలం సంతరించు కుని ,మనం ద్విగ్విజయముగ ముందుకు
సాగేవాళ్ళం..మనం మన సంస్కృతి,చాలా గొప్పగా
ఉండేవి.
            కానీ ఆంగ్లేయులు తమ స్వపరిపాలన కొరకు
స్వార్థంతో మన దేశ ఔన్నత్యాన్ని కాల రాసి మన సంస్కృతిని మంట కలిపి ,మన ధర్మాలను పక్కకు
పెట్టి వారి స్వార్థాన్ని పండించు కుని భారతీయుల్ని
నీట ముంచి ఆంగ్లము సర్వం అని  మనం, భారతీయుల్ని బానిసలు చేసి మన సంస్కృతిని 
నాశనం చేసెసేరు.
        మనం ఏది ముఖ్యమైనది అన్నామా ఆ రోజుని
 వారు శలవు రోజని మధువు, మధ్యం, మాంసం, ముట్ట వచ్చని ఆరోజు  విలువనే  నాశనం చేసి మనదోవలనే పూర్తి వక్రీకరించి సర్వ నాశనం చేసేసారు.
          కాక పోతే ఇప్పటికీ ఆ శక్తి ఆ బలం పోలేదు
మనం మన పద్ధతులు అన్నీ క్రమం తప్పకుండా
చేస్తే విజయం మనదే....

కామెంట్‌లు