నా అక్షరసైన్యం పుస్తకంలో ఒదిగిన పూలపరిమళం. అనుభవాల తేనెఊటలు ఆ అక్షరసైన్యమే. అదృశ్యచిత్రాల విందుచేసేవి, జ్ఞానవీచికల ఝరిలో తడిపేది నా అక్షరసైన్యమే. ఆలోచనల భృంగనాదాలు, సిధ్ధాంతాల మర్మవాదాలు నా అక్షరసైన్య విన్యాసమే. సంతోషాలగేయాలు, చరిత్రగాయాలు, ఇజాలజాతర, నిజాలపాతర ఈ అక్షరసైన్య పుణ్యమే. అశాంతితో ఉన్నపుడు ఓదార్పునిచ్చేది, దుఃఖంలో ఉన్నపుడు కన్నీళ్ళుతుడిచేది, నిరాశపడుతున్నపుడు ఆశను రేకెత్తించేది ఈ సైన్యమే. ఆనందాన్ని ద్విగుణీకృతం చేసేది, కష్టాన్ని సగంచేసేది నా అక్షరసైన్యమే. నా అక్షరసైన్యానికి నిరీక్షణే లేదు అక్షరకిరణాలై జ్ఞానదీప్తులు పంచడం తప్ప. నా అక్షరసైన్యానికి పరీక్షలే లేవు నిరక్షరాస్యతా రక్కసిని అక్షరాస్త్రాలతో తరమడం తప్ప. అందుకే, నా అక్షరసైన్యం ఒక జ్ఞానమణి! ఒక విజ్ఞానఖని!!!
+++++++++++++++++++++++++
అక్షర సైన్యం(చిట్టి వ్యాసం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి