సుదూర తీరాల నుండీ
కదలి వస్తున్న ఆత్మీయునికోసం
ఎదలో నిండిన ఉద్విగ్నతతో
మబ్బుల ఎదురుచూపులంట!
మదిలోని మమతలన్నీ
సొదలెన్నో చెబుతుండగా
పొదపొదలో పూలన్నీ
పకపకమని నవ్వెనంట!
పుడమి తల్లి కట్టిన
పచ్చని పట్టుపుట్టములు
ప్రసరించిన వెలుగులకు
పుత్తడిలా మెరిసెనంట!
గోరువెచ్చని దీవెనలను
మోసుకొచ్చిన కొండగాలి
అదేపనిగా తిరుగుతూ
అందరికీ అందించునంట!
తేటవెలుగుల తేరుమీద
మింట మెరిసిన వెలుగులన్నీ
తోటనిండా పసిడికాంతులు
తనివితీరగ పంచెనంట!
వేకువ పంపిన శుభసందేశం
మోసుకొచ్చిన వెలుగురేఖలు
భువిని మొత్తం ఆవరించగ
జగతి మేలుకుని అచ్చెరువందెనట!
రేపటి కోసం చీకటిరెప్పలు తీసి
మనసారా చేతులు జోడించి
ఎనలేని శుభములిమ్మని
మనసులోనే మృదువుగా పాడే
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి