ప్రిక్సస్! అచ్యుతుని రాజ్యశ్రీ

 గ్రీకు వీరుడు ప్రిక్సస్ సవతితల్లి చేతిలో నానా అగచాట్లు పడ్డాడు.తల్లి నెఫిలీ  భర్త పిల్లల కి దూరం ఐంది.బెయోటియా రాజు అథమాస్ కి నెఫిలీ కి పుట్టిన కవల పిల్లలు .బాబుప్రిక్సస్ పాపం హేలీ సవతితల్లి ఈనో చేతిలో చిత్రహింసలు అనుభవిస్తారు.భర్తకి నూరిపోస్తుంది" పిల్లల్ని జూస్ దేవుడికి బలి ఇస్తేనే తమ రాజ్యం లో కరువుకాటకాలు పోయి చెరువులు జలకళతో నిండుతాయి." పాపం రాజు  పిల్లల్ని తీసుకుని లాఫిస్టియం కొండపై వారిని కత్తితో నరకబోతాడు.దేవుడు జూస్ వారిని చూస్తాడు. మేఘకన్య పిల్లలతల్లి నెఫెల్ జూస్ ఎదుట కన్నీటితో నిలబడుతుంది.బంగారు పొట్టేలనాపంపి వారిని కాపాడుతాడు జూస్.కానీ చిన్నారి హేలీ పొట్టేలు వీపుపైనించి జారి సముద్రం లో పడిపోయింది.అందుకే ఆసముద్రంకి హెలెస్పాంట్ హెలీసముద్రం అని పేరు వచ్చింది.మన పాత జానపద సినిమాల్లో కూడా ముసలిరాజు పడుచు భార్య చెప్పుడు మాటలు విని పట్టపురాణి ఆమె పిల్లల్ని అడవిలో వదిలేయడం చూస్తాం🌺
కామెంట్‌లు