వచన పద్యాలు;- చెన్నా సాయిరమణి
1.అనంత మృధు మధుర మాధుర్య
సుందర సౌకుమార్య సరస మనోహర
సులభ సౌలభ్య అజంతా అక్షర భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

2.విజయ దుందుభిలతో విశేష కీర్తి
వైభవాలతో వెలుగులు చిమ్మిన భాష 
నేడాంగ్ల బంధంలో బిగిసెనయ్య తెలుగు 
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

3. ఎన్ని కీర్తి పతకాలు సాధించినా
    ఎంత ఖ్యాతి నీ వశమయినా
    తల్లి భాష విడిచి ముర్ఖునిగా మారబోకు
    వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!


కామెంట్‌లు