న్యాయాలు -215
రాజ పుర ప్రవేశ న్యాయము
*****
రాజు అంటే ప్రభువు, పుడమి ఱేడు రాచవాడు యక్షుడు ఇంద్రుడు చంద్రుడు అనే అర్థాలు ఉన్నాయి.పురము అంటే నగరము , కోట, అంతఃపురము,పట్టణము , శరీరము, ఇల్లు,మేడ అనే అర్థాలు కలవు.
ప్రవేశము అంటే ప్రవేశించు, లోనికి వచ్చుట,చొచ్చుకొని వచ్చు, సింహద్వారం అనే అర్థాలు కలవు.
రాజ పుర ప్రవేశము అనగా రాజు యొక్క నగరము లేదా కోటలోకి ప్రవేశించుట.
బయటినుంచి వచ్చే వారిని గుంపుగా రాజు యొక్క పట్టణంలోకి వెళ్ళనీయకుండా ప్రవేశ ద్వారము వద్ద ద్వార పాలకులు అడ్డుకుని ఒక్కొక్కరి వంతున మాత్రమే లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇస్తారు.
అలా ఒక్కొక్కరు అదురు బెదురుతో భయం భయంగా రాజ పుర ప్రవేశం చేస్తున్న సమయంలో ద్వార పాలకులు అధికార పెత్తనాన్ని చూపిస్తూ లోపలికి వెళ్ళే ముందు వారిని ఒక పట్టాన వెళ్ళనీయకుండా సతాయిస్తారు.
అదే సమయంలో గుంపులుగా చేరి ఒక్కసారిగా నిర్భయంతో లోపలికి ప్రవేశించే వారిని అడ్డగించే ధైర్యం లేక గోడమీద బొమ్మల్లా చూస్తూ ఉంటారే కానీ కొంచెమైనా మాట్లాడరు,అడ్డుకోరు.
ఒక్కరు వెళ్ళేటప్పుడు చూపిన అట్టహాసము, అహంకారము గుంపులుగా చూసేసరికి నీరుగారి పోతుంది.కారణం గుంపులుగా వచ్చిన వారి సంఘబలం ,ఐక్యతా బలం అన్నమాట.
ఇలా ఏ పనైనా సామూహికంగా కలిసి సాధించాలంటే ముందుగా సంఘబలం కావాలనే అర్థంతో ఈ "రాజ పుర ప్రవేశ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
సంఘబలమే కాకుండా స్థానబలం అని కూడా చెప్పవచ్చు.
ఈ స్థాన బలం గురించి వేమన చెప్పిన పద్యాన్ని చూద్దాం.
"నీళ్ళ లోన మొసలి నిగిడి యేనుగు పట్టు/ బయట కుక్క చేత భంగ పడును/ స్థాన బలిమి గాని తన బల్మి గాదయా/ విశ్వధాభిరామ వినురవేమ!!"
మొసలి చిన్నదిగా ఉన్నా నీళ్ళలో ఉన్నప్పుడు ఎంత పెద్ద ఏనుగునైనా నీటిలోపలికి లాగేసి చంపగలదు. కానీ అదే మొసలి తన స్థానాన్ని వదిలి అంటే నీటిని వదిలి బయటికి వస్తే కుక్క చేత కూడా ఓడింపబడుతుంది. కారణం మొసలికి స్థానం వల్ల బలం వచ్చిందే కానీ స్వంత బలం కాదని అర్థం.
అక్కడ ద్వార పాలకుడిది కూడా అంతే అతడు రాజు నియమించిన ఉద్యోగి.అందుకే స్థాన బలంతో లోపలికి ప్రవేశించే వ్యక్తిని అదిరింది,బెదిరించ గలుగుతున్నాడు.
ఇక సంఘబలానికి వచ్చినట్లయితే.... సామూహిక ఏదైనా సాధ్యమే అనడానికి వలలో పడిన పావురాలు తమను ఎలా రక్షించుకున్నాయో మనకు తెలుసు. అలాగే కలిసి మెలిసి ఉంటే బలం ఎంత ఉంటుందో ఓ ముసలి తండ్రి తన కొడుకులకు కట్ఠెల మోపును తెప్పించి వాటిని విరవమని చెప్పిన కథ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
అలాగే హక్కులకై ,అవసరాలకై చేసిన ఉద్యమాలు సంఘటిత శక్తితో బలంతోనే సాధించబడినవనీ మనందరికీ తెలిసిందే.
కాబట్టి పై "రాజ పుర ప్రవేశ న్యాయము" ద్వారా సంఘబలం,స్థాన బలం యొక్క శక్తి ఎలాంటిదో తెలుసుకోగలిగాం.కదండీ!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి