న్యాయాలు -240
వరగోష్ఠీ న్యాయము
******
వర అంటే ఎన్నిక , శ్రేష్ఠము, ఉత్తమము, దేవతల వలన పొందిన కోరిక లేదా బహుమతి అనే అర్థాలు ఉన్నాయి.గోష్ఠి అంటే సమావేశము,సభ,సల్లాపము, సంభాషణ అనే అర్థాలున్నాయి. గోష్ఠి అనగా పలువురు ఒకచోట గూడి పరస్పరము ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుట..
నలుగురు కలిసి వరుని/ వధువు గురించి కానీ శ్రేష్టమైన విషయం గురించి కానీ తీసుకునే నిర్ణయాన్ని వరగోష్ఠి న్యాయముగా చెప్పవచ్చు.
పెళ్ళి కూతురు లేదా పెళ్ళికొడుకుని నిశ్చయించే సమయంలో బంధువులంతా కలిసి వారి వారి అభిప్రాయాలను తమకు తోచిన విధంగా వెల్లడిస్తూ చర్చలో పాల్గొంటారు. వారి వారి అభిప్రాయాలకు అనుగుణంగా చివరికి ఒక నిశ్చితాభిప్రాయానికి వస్తారు. అలా వరుడు కానీ వధువు కానీ నిర్ణయింపబడి వివాహం జరుగుతుంది.
అలా కాకుండా సదరు వధువు/వరుని నిర్ణయంలో అనేక సందేహాలు, వాదోపవాదాలు జరిగినట్లయితే చివరకు వివాహ ప్రసక్తే లేకుండా పోయే పరిస్థితి వస్తుంది.
ఇది వివాహబంధంలో ఆత్మీయ బంధువుల మధ్య జరిగే చర్చ కాబట్టి దీని గురించి అంతగా ఆలోచించ వలసిన అవసరం లేదు.
కానీ దీనిని ఆధ్యాత్మిక వాదులు తమదైన దృష్టితో చూడటం విశేషం.ఆత్మ స్వరూప నిర్థారణ విషయంలో ఏది సరైనది,కాదు అనే గోష్ఠి జరిపి,చివరికో నిర్ణయానికి రావడం .
ఈ చర్చలో ముఖ్యంగా చేతనేంద్రియములే అంటే జ్ఞానేంద్రియాలే ఆత్మ అని కొందరు.కాదు కర్మేంద్రియాలే ఆత్మ అని మరికొందరు.వాదోపవాదాలు చేస్తూ ఉంటారు.
అసలు చేతనేంద్రియాలు అంటే ఏమిటో చూద్దాం.చెవి ,చర్మం, కన్ను, ముక్కు,నాలుక ఈ ఐదు జ్ఞానేంద్రియాలు వీటినే చేతనేంద్రియాలు అంటారు.క్రియా రూపంలో అంటే కాళ్ళు, చేతులు, వాక్కును పనులు/ కర్మలు చేసేందుకు ఉపయోగిస్తాం కాబట్టి వీటిని కర్మేంద్రియాలు అంటాం.
ఆ విధంగా పంచభూతాల యొక్క ప్రత్యేక సత్వాంశల నుండి జ్ఞానేంద్రియాలు ప్రత్యేక రజో అంశాల నుండి కర్మేంద్రియాలు ఏర్పడుతాయి.వీటితోనే చైతన్య శక్తి ప్రాణ శక్తి కలుగుతాయి.
చేతనేంద్రియముల ద్వారా ఈ భౌతిక శరీరము ఒక చోట నుండి మరొక చోటికి చలిస్తుంది. ప్రాపంచిక విషయాలను గ్రహించడంలో చేతనేంద్రియాలు, చైతన్యంతో కూడి ప్రత్యేక పాత్రను వహిస్తాయి.
అదే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ ఇంద్రియాలు పని చేయవు.అప్పుడు మనల్ని జీవింప చేసేది ప్రాణము.అది ప్రాణ శక్తిగా మన శరీరాన్ని,అవయవాలను నడిపిస్తుంది. దీనినే జీవ శక్తి అంటారు. ఈ జీవ శక్తి శరీరానికి, ప్రాణానికి బంధాన్ని కలుపుతుంది.
ఈ జీవ శక్తి బంధం తెగిపోతే ప్రాణం అచేతనం అవుతుంది అంటే పోతుంది.అప్పుడు ఈ భౌతిక శరీరాన్ని మృత దేహం అంటారు.
ఈ విధంగా చేతనేంద్రియాలను, కర్మేంద్రియాలను చైతన్యవంతంగా నడిపించే శక్తిని ఆత్మ అంటారని ప్రశ్నోపనిషత్తులో చెప్పబడింది.
"రమణ మహర్షి గారు ఆత్మ గురించి చెబుతూ "చూడబడేది,చూసేది, చూపు అన్నీ అదే.ఎరుకయే దాని స్వరూపం" అంటారు.
ఇలా ఆధ్యాత్మిక పరమైన వాదోపవాదాలు చేసి చివరకు ఆత్మ స్వరూపాన్ని గురించి ఒక స్థిరమైన నిర్ణయానికి, నిర్థారణకు రావడాన్ని ఈ "వర గోష్ఠి న్యాయము"తో పోల్చడము ఓ విశేషంగా చెప్పుకోవచ్చు .
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి