నాన్న మాట్లాడరేమి! (చిట్టి వ్యాసం);- - డా. గౌరవరాజు సతీష్ కుమార్.

 తన ఆశలను అటకపైకెక్కించి, తన ఆశయాలకు నీళ్ళొదులుకుని, తన కోరికలను కలలను పాతరేసి, తన బహిప్రాణాల పాదాలకు తన అరచేతుల పాదరక్షై, వాళ్ళ ఆనందాన్ని తనకళ్ళల్లో నింపుకుని, సంతోషపు అలలమీద ఊయలలూగుతాడు. తనఒడినే బడిగా, తనభుజాలే సింహాసనంగా మార్చి, సంతోషపు చెమటచుక్కై రాలి, పురివిప్పిన నెమలిలా ఆడుతాడు. తాను చీకటిలో నడిచినా వారికి దివిటీఅయి వెలుగుచూపి, తాను చిరిగినచొక్కాఅయినా వారి కలంలో సిరాచుక్కై, తన ఉగాదులు ఉషస్సులను తనవారికి ధారవోసి, మౌనంగానే ఉబ్బి తబ్బిబ్బవుతాడు. తనకుతాను సంతోషంగా తనవారికి పెన్నిధై, తానే వారికి పూర్తికాలపు రక్షణకవచమై, తుదిశ్వాసవరకు తనశ్వాస తనవారే అనుకుంటూ, మంటిలో కలిసిపోతూ మింటిలోచుక్కై నిలిచి మురిసిపోతూ తనవారిని అపురూపంగా చూసుకుంటాడు. తనవారి విజయాలను ఆకాంక్షిస్తూనే ఉంటాడు. ఇలా చేసేదంతా చేసిన నాన్నను ఇంకేంమాట్లాడమంటావు? !!!
+++++++++++++++++++++++++

కామెంట్‌లు
visalakshi చెప్పారు…
నాన్నహృదయాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన అభినందనీయులు సతీష్ రాజుగారు.
Joshi Madhusudana Sharma చెప్పారు…
నాన్న ఇంకేమిస్తాడు 👌👏👏🌹🙏🌹
చాలా బాగా చెప్పారు. కవితా రూపంలో, చిట్టి వ్యాసంలో. ధన్యవాదములు కవి మిత్రులకు. 🙏