గ్రీకు దేవత హేరా! అచ్యుతుని రాజ్యశ్రీ

 జేసన్ కి అనారస్ అనే నది దగ్గర ఓముసలి అవ్వ కన్పిస్తుంది.తనను నదిని దాటించమని జేసన్ని అడుగు తుంది.అతను అవ్వను భుజాలపై ఎక్కించుకొని నదిలో దిగుతాడు.మొదట బరువుగా లేని అవ్వ క్రమం గా బరువు ఎక్కుతున్నా పాపం ఆవలిఒడ్డుకు చేర్చాడు.అంతే ఆమె మాయం ఐంది.ఆమె దేవమాత హేరా అని అతనికి తెలీదు.పెలియాస్ అనే రాజుకి బుద్ధి చెప్పాలని తగిన వీరుని కోసం వెతుకుతూ ఉంది.జేసన్ ఆమె పరీక్ష లో నెగ్గాడు.మన ఇంద్రుడు కూడా ఇలాగే పరీక్షలు పెడ్తాడు కదూ?🌹
కామెంట్‌లు