కలల సౌధానికి వెల్లవేసి
కళలు కురియగ చేసే
వేకువ
మనసులోపలి మమతల
పొరలు తీసి చూపే
వేకువ
చీకటిలో చెదిరే మనసుకు
ధైర్యమెంతో నూరిపోసే
వేకువ
పోరాటంలో అలసిన మదికి
కొత్త ఉత్సాహం నింపే
వేకువ
మార్చలేని విషయాలను
మరపించే మార్పు తెచ్చే
వేకువ
కొత్త ఆశలు కొత్త చివురులు
తొడిగే నవజీవమిచ్చే
వేకువ
కాలానుగుణంగా మార్పులు
ఆలోచనలో తెచ్చే
వేకువ
మౌనమైన మూగబాసల
రాగమేదో పలికించే
వేకువ
విధిని మార్చే అవకాశమిస్తూ
కదిలి వచ్చే కొత్త
వేకువ
జీవితంలో బంధాల విలువ
లీలగా తెలియచెప్పే
వేకువ
మబ్బు మూసిన నింగిలో
మెరుపులెన్నో మోసుకొచ్చే
వేకువ
వసుమతికి బహుమతిగ
వసంతపు వెలుగులు తెచ్చే
వేకువ..
ఏది ఎవరికి ఎంత ఎపుడు
ఇవ్వాలో దానిని
అందరికీ అంతరాయంలేక
అందించే వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి