హిట్లర్ (చిట్టి వ్యాసం);- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్

 క్లారా, అలోఇస్ దంపతుల ముద్దుల కొడుకైనవాడు. సైనికుడుగా జీవితం ప్రారంభించినవాడు. నాజీ పార్టీ నాయకుడైనవాడు. జర్మనీదేశ పాలకుడైనవాడు. ఏకఛత్రాధిపతిగా సర్వాధికారాలను తనవెంటే ఉంచుకున్నవాడు. శ్రామికసంఘాలను, రాజకీయపార్టీలను రద్దుచేసినవాడు.
నిరంకుశ నియంత్రణతో నియంతగా మారినవాడు. రెండో ప్రపంచయుద్ధానికి కారణమైనవాడు. ఇరువైమూడు లక్షలమందిని రాక్షసంగా హతమార్చినవాడు. నెత్తుటి ఏరులు పారించినవాడు. తననుతాను సూపర్ మ్యాన్ గా భావించినవాడు. సిగరెట్లు తాగనివాడు. మాంసాహారం ముట్టనివాడు. అయినా…, బహు వ్యాధులతో బాధలు పడినవాడు.
ప్రేమికురాలు "ఇవాబ్రౌన్" ను పెళ్ళాడినవాడు. నవదంపతులైన రెండురోజుల్లోనే ఆత్మహత్యకు లోనైనారు. వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలిపోయింది. కానీ, మహామాన్య హిట్లర్ ఆత్మ కొందరు నాయకులచుట్టూ తిరుగుతూ వారిని ఆవహించినట్లు అనిపిస్తోంది కదూ?!
+++++++++++++++++++++++++
.
కామెంట్‌లు