పిల్లల్లో ఉన్నత వ్యక్తిత్వం-సి.హెచ్.ప్రతాప్
వ్యక్తిత్వ వికాసం అనేది జీవితకాల ప్రక్రియ, ఇది నిర్మించడానికి సమయం పడుతుంది. వారి బాల్యం ప్రారంభం నుండి వారి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంలో మనం సహాయం చేయడం అవసరం. చాలా చిన్న వయస్సు నుండి అభివృద్ధి చెందే వ్యక్తిత్వం శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి, మన పిల్లలు పసిబిడ్డలుగా ఉన్నప్పుడే వారిలో మంచి అలవాట్లు, ప్రవర్తన మరియు నైతికతలను పెంపొందించడం అవసరం. ఇంకా, వ్యక్తిత్వ వికాసంలో కుటుంబం ఒక సమగ్ర పాత్ర పోషిస్తుంది;
పెద్దవారిని గౌరవించాలని ప్రతి తల్లిదండ్రీ చెబుతారు. కానీ చెప్పాల్సిన విధంగా చెప్పకపోతే ఆ విషయం  పిల్లలకు అర్థం కాదు. అర్థమవ్వాలంటే తమ చుట్టూ వున్న వారితో సానుకూలంగా ప్రవర్తించాలని, అడిగిన విషయాలకు సమాధానం చెప్పాలని చెప్పండి. ఏదైనా సాయమడిగితే చేయాలని, చిన్న పిల్లలతో ప్రేమగా మాట్లాడాలని చెప్పండి. స్నేహితులతో గొడవలు పడొద్దనీ చెప్పండి.

తల్లిదండ్రులు తరచుగా తమకు సమయం లేదని చెబుతుంటారు. ఏ ఆర్నెల్లలో ఒకసారి పేరెంట్స్ టీచర్ మీటింగుకు వెళ్ళి టీచర్లతో చదువు విషయం మాట్లాడుతుంటారు. కాని ఈ పద్ధతి మంచిది కాదు. చదువు విషయంలో టీచర్లతో తరచూ మాట్లాడుతూ ఉండాలి. పిల్లలు ఏ సబ్జెక్టుల్లో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుని ఆ విషయాలపై పట్టు సాధించేలా సిద్ధం చేయాలి. స్కూలు యాజమాన్యాన్ని కూడా సంప్రదిస్తూ ఉండాలి. క్లాసు రూంలో పిల్లల ప్రవర్తనపై ఆరా తీయాలి. సబ్జెక్టు వారీగా వారి లోటుపాట్లు తెలుసుకోవాలి. పిల్లల పట్ల తల్లిదండ్రులుగా మీరేం చేయాలో అడగండి. ఇలా చేయడం వల్ల టీచర్లు, పిల్లలు కూడా మీకు సహకరిస్తారు. స్కూల్లోనూ, ఇంట్లోనూ సానుకూల వాతావరణం ఉంటేనే పిల్లలు, విద్యావంతులుగానే కాక, ఉన్నత వ్యక్తిత్వం గలవారిగా కూడా ఎదగగలుగుతారు.  
కామెంట్‌లు