పుట్టుక చావు....మధ్య
ఆరాటాల పోరాటాలు
జయాపజయాలు....
మాయాజాలం !
*******
జీవన్నాటకంలో....
బాల్య ఘట్టము
ఓ మరచిపోలేని...
మధుర జ్ఞాపకం !
******
జీవిత మంతా ....
జీవన పోటీలే ....!
గెలుపు - ఓటమిలు
సహజాతి సహజం !!
*****
పరాజయాలకు...
పచ్ఛా త్తాపమా.. ?!
పట్టుదల పెంచుకో....
. ఉత్సాహమే విజయం !
*******
జీవితం యుద్ధమనుకుంటే
వేదన.... !
ఇదొక ఆట....
అనుకుంటేనే ఆనందం !
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి