డెబ్బయ్యయిదేళ్ళ
స్వాతంత్య్రం....
నిగ - నిగ లాడుతోంది
మేడిపండులాగా ... !
*******
స్వాతంత్ర్య మొచ్చింది
అర్భకుల్ని నెట్టి ...
అవకాశవాదుల్ని
అందలమెక్కిoచ !
*******
స్వాతంత్య్రం వచ్చి
అన్నిరంగాల్లోనూ...
మనం ముందున్నాం .. !
అసమానతలతో సహా !!
******
ఆజాదీకా...
.. అమృత మహోత్సవ్ !
పేద వాడిoటిలో...
పండగ చందంగా .. !!
*******
స్వాతంత్య్రం కోసం...
సమరం సఫలం... !
ఆశయసాధనలో...
పూర్తిగా విఫలం... !!
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి