జెండా పండుగ - (బాల గేయం)- త్రిపురారి పద్మ జనగామ
జెండా పండుగ వచ్చింది
సందడి ఎంతో తెచ్చింది 

మువ్వన్నెల జెండా మనదండి
భరతమాతకే వెలుగండి

త్యాగం, శాంతి, పచ్చదనం
పెంచే జెండా మనదండి

అశోక చక్రం చూడండి
విలువలు ఎన్నో కలవండి

వీరుల త్యాగం తలవండి
జెండా వందనమనరండి.

పిల్లల్లార రారండి
భరతమాతనే కొలువండి


కామెంట్‌లు