తెలిమంచు కరిగేవేళ
నవ వధువైన వసుధను
నులివెచ్చని వెలుగుల రవ్వలతో దీవిస్తున్న రవి రూపం
పడమరలో వీడ్కోలు పలికి
తూరుపులో వీక్షింప దలచి
నిశీధిలో నిట్టూర్పులతో
నిరీక్షించు నింగీ నేలా
కొండలనడుమ కోరుకున్నదైవం
కోరికలెన్నో తీర్చే నేస్తం
అండగ నేనున్నానంటూ
నిండుగ పలికే పండంటి దీపం
ఎదురు చూపులు ముగిసి
కనులముందు నిలిచే
కోటి ప్రభల దినకరునికి
కై మౌడ్పులతో స్వాగతం
నింగిని మబ్బుల రంగులు
నేలను అమరిన హంగులు
కోనను కురిసే ఝరులు
ప్రకృతి సమస్తం పలికే
ఆహ్వానం అందుకని
ఆగమించే ఆదిత్యునికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి