శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 మీమాంస అంటే అర్థం ఏమిటంటే గంభీరమననం‌ ఓవిషయంపై మూలతత్వంని అర్థం చేసుకోవటం.అలాంటి వివేచన తో నిర్ణయం పరిణామం జరగటంనే మీమాంస అంటారు.పూర్వ ఉత్తర మీమాంస అని రెండు రకాలు.వేదాంతాన్ని ఉత్తరమీమాంస అంటారు.పూర్వమీమాంసకర్త జైమిని ఉత్తరమీమాంస కర్తబాదరాయణుడు. వైదిక కర్మకాండలు గూర్చి పూర్వం దాంట్లో ఉంది కాబట్టి దీన్ని
 కర్మమీమాంస అని అంటారు.
ఉత్తర మీమాంస లో బ్రహ్మ విశ్వాత్మ వివేచన ఉంది.దీన్ని వేదాంత దర్శనము అంటారు.మీమాంసకుడు అనే పదం ఉద్భవించింది.
ముసహర్ అనే జాతివారు యు.పి.లో బహుధా అనే గ్రామం బైట నివసిస్తారు.వీరు ఎలుకలను చంపి తింటారు.మూస్ అంటే ఎలుకలు హరించి చంపి అని అర్థం.అందుకే వీరిని ముసహర్ అని పిలుస్తారు.వీరిభాష పూర్తిగా భిన్నం🌹

కామెంట్‌లు