సుప్రభాత కవిత ; బృంద
సత్యమేవ జయతే!
సత్యానికి మాత్రమే జయం

ఎన్ని మబ్బులు గోడలు కట్టినా
ఎన్ని మబ్బులు కుంభవృష్టి కురిపించినా

ఎన్న అడ్డంకులు ఎదురైనా
ఎన్ని మలుపులు తిరిగినా

ఎన్ని మోసాలకు లోనైనా
ఎన్ని కుయుక్తులకు బలైనా

ఎన్ని వక్రదృష్టులు పడినా
ఎన్ని ఆక్కసులకు కారణమైనా

ఎన్ని స్వార్థాలు కబళించినా
ఎన్ని అనర్థాలు  కలిగించినా

ఎన్ని అపజయాలు ఎదురైనా
ఎన్ని విజయాలు గుర్తింపకపోయినా

ఎందరు  మనసు కష్టపెట్టుకున్నా
ఎందరు మోకాలడ్డినా

ఎన్ని అవాంతరాలు కలిగించినా
ఎన్ని అంతరాలు చూపించినా

ఎన్ని దుర్మార్గాల పాలబడినా
ఎన్ని చిత్రహింసలు ఎదుర్కొన్నా

అడుగడుగూ ముందుకే వేసి
అభవృధ్డి బాటను నడిచే

స్వతంత్ర భారతదేశం
ప్రపంచానికి తలమానికం

భారతదేశం మనది
సనాతనధర్మం మనది

భారతీయులమైనందుకు
గర్విద్దాం
భారతీయతను నిలబెడదాం

సుజనాలుగా
సుఫలాలను అందించి

సస్య శ్యామలమైన 
హిందూ దేశాన్ని
విశ్వగురువుగా నిలబెడదాం

సతతహరితమైన
పుణ్యభూమికి ప్రణమిల్లి
ధన్యులమవుదాం

వందేమాతరమ్ 🌸🙏🌸


కామెంట్‌లు