వాగ్దేవిపురం ప్రభుత్వ పాఠశాలలో అతుల్,అక్షర,ప్రసూన్ లు పదవ తరగతి చదువుతున్నారు.తరగతిలో అందరికన్నా వీళ్ళు ముగ్గురూ పోటీపడుతూ చదివేవారు.అన్ని సబ్జెక్టులలోను వందశాతం మార్కులు తెచ్చుకునే వారు. సుహిత్, సంహిత,సుధాంష్ లు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివేవారు.వీళ్ళు తెలుగులో తప్ప మిగతా వాటిలో 100%మార్కులు తెచ్చుకునేవారు. ఆంగ్లంలోనే పాఠాలను చదువుకునే వారు.మేమే ఆంగ్లంలో చదువుతున్నామనే పొగరు కూడా వారిలో రోజు రోజుకూ పెరుగుతూ ఉన్నది .కానీ అతుల్,అక్షర,ప్రసూన్ లకు తెలుగులో కూడా మంచి మార్కులు ఎలా వస్తున్నాయో వారికి అర్థము అయ్యేది కాదు.
ఒకసారి అన్ని పాఠశాలలకు ఒకే వేదికపై మాతృభాష గొప్పదనంపై చర్చాపోటీలు నిర్వహించగా సుహిత్,సంహిత,సుధాంష్ లు ఆంగ్లభాషే అన్నిటి కన్నా గొప్పది. ప్రపంచం అంతటా ఆంగ్లభాషనే ఎక్కువగా మాట్లాడుతున్నారు.మాతృభాష కన్నా ఆంగ్లమే గొప్పది అని వాదించగా అతుల్,అక్షర,ప్రసూన్ లు మాత్రం మాతృభాషనే గొప్పదని,ప్రతి భావనను మనం మాతృభాషలో చక్కగా వ్యక్తీకరించవచ్చని,సులువుగా మన అభిప్రాయాలను ఇతరులకు చెప్పవచ్చునని,మాతృభాషలో పట్టు సాధిస్తే ఇతర భాషలు సులభంగా నేర్చుకోవచ్చని వాదిస్తుండగా ప్రేక్షక ఉపాధ్యాయులు,విద్యార్థులంతా వీరితో ఏకీభవిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టారు.అంతలోనే అతుల్ అమ్మా అనే పిలుపులో ఉన్న మాధుర్యం మమ్మీ అనే పిలుపులో వినిపిస్తుందా అనగానే సుహిత్,సంహిత,సుధాంష్ లు లేచి తమ మిత్రులను అభినందిస్తూ మీరు చెప్పినవి సరియైనవే అంటూ ఒప్పుకుని ఇంకెప్పుడూ మన మాతృభాషను కించపరచమని చెప్తారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి