* నాన్న లేని జీవితం* ;- ఎండి రిజ్వాన-పదవ తరగతి- Z.P. H .S నీర్మల
 అనగనగా ఒక ఊరు. ఆ  ఊరిలో రాజయ్య కోటమ్మ అనే దంపతులు ఉండేవారు. ఒక కూతురు కుమారుడు ఉన్నారు. పేరు మాలిని. కుమారుడి పేరు రోహిత్. రాజయ్య కి తన కూతురు మాలిని అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే. తను ఎంత కొంటె పనులు చేసిన కొట్టేవాడు కాదు.  కుమారుడు రోహిత్ కూడా అంటే చాలా ఇష్టం. మాలిని చాలా చదివేది కోటమ్మ రాజయ్య వ్యవసాయం చేసేవారు. కొంతకాలం కింద వాళ్ళు పత్తి పంట వేశారు. కానీ వర్షాలు ఎక్కువ రావడంతో ఆ పంట మొత్తం నాశనం అయ్యింది. వాళ్ళ ఇంట్లో చాలా కరువు అయింది. పాపం రాజయ్య కోటమ్మ చాలా బాధపడ్డారు. ఇంట్లో తినడానికి కూడా బియ్యం లేవు. డబ్బులు కూడా లేవు. చాలా పేదరికానికి తోడయ్యారు. రాజయ్య ఇలా అయితే ఇల్లు గడవడం చాలా కష్టం నేను వేరే ఊరికి పనికి వెళ్తాను. అని అన్నాడు. అని కోటమ్మతో అన్నాడు. పొద్దుగాలనే లేచి తన టిఫిన్ తీసుకుని. బండి మీద పక్క ఊరికి పనికి వెళ్లేవాడు .అలా కొన్ని రోజులు వెళ్ళసాగాడు. ఇంట్లో ఇప్పుడు బాగానే పైసలు ఉన్నాయి. రాజయ్య కోట మాలిని రోహిత్ చాలా సంతోషంగా జీవించసాగారు. కానీ ఒకరోజు మాలిని వాళ్ళ నాన్న రాజయ్య ఇంకా పని నుంచి ఇంకా ఇంటికి రాలేదు. చీకటి కూడా అవుతుంది. చాలా భయం కలిగి. ఇంతలోనే వాళ్ళ ఇంటికి సర్పంచ్ వచ్చాడు. రాజయ్య లేడా అని అడిగాడు. అప్పుడు కోటమ్మ ఇంకా పని నుండి రాలేదు  అయ్యా అని అన్నది. అప్పటికి మాలిని కి తెలిసింది. రాజయ్య ఆక్సిడెంట్ లో చనిపోయాడు అని. మాలిని కి ఏం అర్థం కాలే అలానే కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు వాళ్ళ గల్లి వాళ్ళు అందరూ వచ్చారు. కోటమ్మకి చెప్పారు రాజయ్య చనిపోయాడు. అని కోటమ్మ పాపం చాలా ఏడవ సాగింది. రాజయ్య ఆగి ఉన్న లారీ కి వెళ్లి గుద్దాడు. మాలిని కోటమ్మ రోహిత్ చాలా బాధపడ్డారు. మాలికి వాళ్ళ నాన్న చావు కార్యక్రమాలు అయిపోయాయి. కొన్ని రోజులు మాలిని అన్నం తినలేదు. పాపం తను రోజంతా ఏడుస్తూ ఉండేది. కోటమ్మ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు నేను నా పిల్లలు ఎలా బ్రతకాలని ఆలోచిస్తుంది. ప్రభుత్వం రైతు బీమా అని వాళ్లకి ఐదు లక్షలు ఇచ్చారు. అవి కోటమ్మ  మాలిని పేరు మీద బ్యాంకులో వేసింది. అలా రోజు కోటమ్మ కూలీ పనికి వెళ్లే సాగింది. కానీ రాజయ్య వ్యవసాయానికి చేసిన అప్పులు అలానే ఉన్నాయి . అప్పులొల్లు రోజు ఇంటికి వచ్చి తిట్టసాగారు. అప్పుడు మాలిని వాళ్లతో ఇంకా కొన్ని రోజు లో మీ డబ్బులు మీకు కట్టేస్తా ము అని చెప్పింది. వాళ్లు వెళ్లిపోయారు. మాలిని పాపం. బడిలో వాళ్ళ స్నేహితులు అందరూ మా నాన్న ఇది తెచ్చాడు అది తెచ్చాడు అంటుంటే మాలిని పాపం చాలా ఎడిసేది .రోజు వాళ్ళ నాన్న గుర్తొచ్చేవాడు. అప్పుడు మాలిని తన మనసులో నేను బాగా చదువుకొని పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలి .అని మా నాన్న కోరిక నెరవేరుస్తాను. మా అమ్మని తమ్ముని బాగా చూసుకుంటానని అనుకుంది.
        __ సందేశం___
*రోడ్డు ప్రమాదంలో చాలా మంది చనిపోతున్నారు. *దయచేసి వేగంగా వెళ్ళకండి. *తలకి హెల్మెట్ ధరించండి. హెల్మెట్ లేకపోతే మీ కుటుంబం చాలా పడుతుంది. అందరూ దయచేసి హెల్మెట్ ధరించకుండా వేగంగా వెళ్ళకండి...🙏🙏🙏కామెంట్‌లు