చంద్రాపురం అనే గ్రామంలో మాధవ అనే ఒక మంచి గుణవంతుడు ఉండేవాడు.తన భార్య పేరు లక్ష్మి. తనకు గౌరీ,లక్ష్మణ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.మాధవ దానగుణం కల గొప్ప వ్యక్తి.ఎవరు సహాయం అడిగినా వారికి లేదనకుండా దానం చేస్తుండేవారు.ఆ ఊరిలో మాధవ అంటే అందరికీ ఎంతో ఇష్టం మరియు అభిమానం.తాను ఎప్పుడూ ఎవరిని కోపగించుకునేవాడు కాదు. అందరినీ తన సొంత వాళ్ళ లాగా చూసుకునేవాడు.
తనది ఒక మధ్య తరగతి కుటుంబం అయినా అందరి కష్టసుఖాలలో పాలుపంచుకునేవాడు.ఆ ఊరిలో రామయ్య అనే ధనవంతుడు మాధవని చూసి అసూయపడేవాడు.అతన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చూసేవాడు.కానీ దాయాదుల కుట్రల వలన రామయ్య తన ఆస్తిపాస్తులు అన్నింటిని కోల్పోయాడు.
అప్పుడు బాధతో బావిలో దూకి చనిపోవాలనుకున్నాడు. అటుగా వెళుతున్న మాధవ రామయ్యను చూసి బావిలో దూకకుండా కాపాడాడు.
రామయ్య మాధవకి జరిగినదంతా చెప్పాడు. పరిస్థితులు చక్కదిద్దేవరకు తన ఇంట్లో రామయ్యను ఉండమన్నాడు.మాధవ మంచితనాన్ని
రామయ్య కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
అలా కొన్నాళ్ళు రామయ్య మాధవ ఇంట్లో ఉన్నాడు.ఆ తర్వాత తన ఆస్తిని తిరిగి సంపాదించుకున్నాడు. పిల్లాపాపలతో సంతోషంగా ఉండసాగాడు.తను కూడా ఇతరులకు తన చేతనైన సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు.
కొంతకాలం తర్వాత మాధవ అనారోగ్యంతో చనిపోయాడు.దాంతో తన భార్యా పిల్లలు దిక్కులేని వారయ్యారు.అప్పటి నుండి రామయ్య వారిని తన కుటుంబ సభ్యులు లాగా ఆదరించారు.మాధవ తన దాన గుణం వలన ఎందరో ఆప్తులను సంపాదించుకున్నాడు.తన భార్యాపిల్లలను ఊరి వారంతా తమ సొంత పిల్లల్లాగా చూసుకునేవారు. తండ్రి లేని లోటును తెలియనిచ్చేవారు కాదు. అందుకే మనకున్న దాంట్లో కొంత ఇతరులకు దానం చేయడం వలన మనం,మన కుటుంబం ఆనందంగా జీవించవచ్చు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి