ఉపాధ్యాయుడు ; - ప్రతిభా భారతిస్కూల్ అసిస్టెంట్ సైన్స్ప్రభుత్వాన్ని నెంబర్ 2 పాఠశాల తాండూరు వికారాబాద్ జిల్లా
05 సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
-------------------------------------------------------------------
వెంకట్  మొలక ప్రత్యేక ప్రతినిధి
-------------------------------------------------
అక్షర జ్ఞానమందించె
అజ్ఞానంను తొలగించె
కొవ్వొత్తిలా తను కరిగి
జ్ఞానజ్యోతి వెలిగించె!

విద్యాబుద్ధులు నేర్పును
బతుకుదారి చూపించును
విద్యార్థులను గురువు
గొప్పగా తీర్చిదిద్దును!

దిశానిర్దేశం చేసి
భవితకు బాటల్ని వేసి
మదిలో మురిసి పోవును
ప్రగతికి పునాదులు వేసి!

దేశ ప్రగతికి కారణము
చదువు ఒక్కటే మార్గము
అందుకు చదువు నీర్పేటి
గురువు ఒక్కడే మూలము!

గుణములోన మిన్నరా
జగతికి తేజమ్మురా
సమాజ శ్రేయస్సును
కాంక్షించె దేవుడురా!


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
చాలా మంచి కవిత ధన్యవాదాలు