వికారాబాద్ జిల్లాలో ఎస్సై ఎంపికైన 47 మంది అభ్యర్థులకు ఘన సన్మానం.;-వెంకట్ మొలక ప్రతినిధి,




 వికారాబాద్ జిల్లా చరిత్రలోని
మొట్టమొదటిసారిగా 47 మంది ఎస్సైలుగా ఎంపిక కావడం అభినందనీయం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ,ఎస్పీ ఎన్ కోటిరెడ్డి, బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద పటేల్ వెల్లడి
---------------------------------------------------------------
 వికారాబాద్ జిల్లా నుండి భారీ సంఖ్యలో ఎస్సై లుగా ఎంపికైన అభ్యర్థుల ను వికారాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్ మెంట్ ఫోరం నూలి శుభ ప్రద్ పటేల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం నాడు ఘనంగా సన్మానించారు.వికారాబాద్ లోని ఆర్ బంకెట్ హాల్ లో ఫోరం అధ్యక్షులు కె.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా హాజరైన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లా నుండి 47 మంది అభ్యర్థులు ఎస్సైలుగా ఎంపిక కావడం హర్షనీయమని, వికారాబాద్ జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎంపిక కావడం వారి తల్లిదండ్రులను అభినందించారు లక్ష్య సాధనలో ఎన్ని ఆటంకాలు వచ్చిన లెక్కచేయకుం డా ముందుకు సాగినపుడే లక్ష్యాన్ని సాడించగలమని ఆయన పేర్కొన్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ ప్రధానమని,సామాజిక దృక్పథం కూడా అవసరమని అన్నారు.ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిన తల్లిదండ్రులను మరవరా దని,వారిని చూసుకోవాల ని ఆయన అభిప్రాయ పడ్డారు.. కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ కోటి రెడ్డి మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అంటే 24 గంటలు విధినిర్వహణ లో ఉండాలని,పని చేసే మనస్తత్వం ఉంటే ప్రజలకు సేవ చేయగలమని అన్నారు.ఉద్యోగం రావడం ఒక వంతు అయితే శిక్షణ పూర్తి చేయడం కూడా ప్రధాన ఘట్టమని అన్నారు.ఈ సందర్భం గా ఎంపికైన అభ్యర్థులను ఆయన అభినందించారు..ఈ కార్యక్రమం లో అతిథి గా పాల్గొన్న రాష్ట్ర బిసి కమీషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా చార్మినార్ జోన్ లోకి మారడం వల్లనే ఇంత మంది అభ్యర్థులకు ఎస్సై లుగా అవకాశం లభించిందని అన్నారు.జోన్ మార్పు కోసం వికారాబాద్ డెవలప్మెంట్ పురం చేసిన కృషి ఫలించింది అన్నారు.ఈ కార్యక్రమంలో అడిష నల్ ఎస్పీ మురళీధర్,విడిడిఎఫ్ అధ్యక్షులు శ్రీనివాస్,సభ్యులు తస్వర అలీ, ఎం.దేవదాస్, ఎం. దేవదాస్,మారుతీ,మానిక్ రెడ్డి,మాదవ రెడ్డీ,తిరుపతి రెడ్డి,బాబ్య నాయక్,వెంకట రెడ్డి,టి.శంకర్, ఫకృద్దీన్ నూలి శుభప్రద్ పటేల్ చారిటబుల్ ట్రస్ట్  సభ్యులు శ్రీశైలం,కేదార్,శాంత్ కుమార్,కురవ బాలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎస్సైలుగా ఎంపికైన పలువురు అభ్యర్థులు,వారి తల్లిదండ్రులు తమ అనుభవాలను పంచుకొన్నారు.అనంతరం అభ్యర్థులను మఖ్య అతిథులు, విడిడిఎఫ్ సభ్యులు ఘనంగా సన్మానించారు.
కామెంట్‌లు