ఆలోచనే ముఖ్యండా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి వ్యక్తి వయసు పెరిగిన తర్వాత వృద్ధాప్యం రాక తప్పదు  మానవ ప్రకృతిలో  చివరి దశ అదే. అయితే యువ తరం రావడం అనేది  ఏ వయసులో వస్తుంది ఎలా వస్తుంది  అని మనం ఆలోచించినట్లయితే శ్రీ శ్రీ అన్న మాట మనకు జ్ఞాపకం రాకపోదు  కొంతమంది యువకులు పుట్టుకతోనే ముదుసలులు  అలాగే చిన్నయ్య సూరి  అనువదించిన విష్ణు శర్మ గారి పంచతంత్రంలో  జరా మరణములు లేక విద్యా ధనములగడియింపవలె అన్నారు  మానసికమే తప్ప  భౌతికం కాదు అని  చాలామంది అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు. 50వ సంవత్సరం రాగానే  నేను ముసలి వాడిని అయిపోయాను కదా అన్న ఆలోచన  చాలామందికి వస్తూ ఉంటుంది  దానివల్ల నిజంగానే ముదుసలులు అయిపోతారు.
కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం  వారు 90 సంవత్సరాలు గడిచిన  వారి పనులు వారు చేసుకుంటూ  గ్రంథ పఠనం కానీ  ఉపన్యాసాలు ఇవ్వడంతో గాని  తనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచడం కానీ చేస్తూ ఉంటారు  వారు అలా ఎలా ఉండగలుగుతున్నారు అని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఏ వ్యక్తి అయినా శారీరకంగా వచ్చే ముసలితనం వేరు  మానసికంగా వచ్చే  స్థితి వేరు  నాకు ముసలితనం ఏమిటి  నా శరీరం కృంగి కృసించిపోవచ్చు తప్ప  నేనెందుకు మానసికంగా బలహీన పడిపోతాను అని ఆలోచించుకునే వ్యక్తి  తన జీవిత కాలంలో వృద్ధాప్యము అన్న  ఆలోచనకే చోటు ఇవ్వడు  ఎప్పుడు ఆలోచనలు అలా వెళ్లావు  శరీరం కూడా అలాగే అలవాటు పడుతుంది  అని మానసిక నిపుణులు చెబుతూ ఉంటారు.
ఏ పని చెప్పినా కొంతమంది  బద్ధకిస్తూ తరువాత చేద్దాంలే అని  సమయాన్ని పొడిగిస్తూ ఉంటాడు  కొంతమంది  ఈ జీవితంలో కాక మరెప్పుడు ఆనందిస్తాం అన్నఅభిప్రాయంతో  చెడ్డ అలవాట్లకు లోనై  చెడ్డ స్నేహాలకు అలవాటు పడి  ముసలితనాన్ని కావాలని తెచ్చుకుంటారు  మంచి పుస్తకాలను చదవడం  చక్కటి వ్యాయామం  శరీర వయసుకు తగినట్లుగా  నడక కానీ ఆసనాలు కానీ  యోగా లాంటివి చేసినట్లయితే  ముసలి అనే శబ్దం తన మనసుకు అంటదు  నిత్యం ఉల్లాసంగా  చిన్నపిల్లలతో కాలక్షేపం చేస్తున్న వారికి  ముసలితనం   రాదు  తన మనసును తన అధీనంలో ఉంచుకున్న వాడు  నిండు నూరేళ్లు ఆరోగ్యవంతంగా జీవించగలరని మన పెద్దలు చెబుతూ ఉంటారు.


కామెంట్‌లు