జయతి లోహితాక్షన్....;- ప్రమోద్ ఆవంచ 7013272452 జయతి... నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండల కేంద్రానికి చెందిన ఒక కౌలు రైతు కూతురు.మద్య తరగతి కుటుంబంలో జన్మించింది.పీజీ విద్య వరకు కష్టపడి చదువుకుంది.లోహి...కెరళా రాష్టానికి చెందిన
పోస్ట్ గ్రాడ్యుయేట్.ఇద్దరూ హైదరాబాద్ లో ఒక స్కూల్ లో పనిచేసేవారు.ఆ తరువాత వారిద్దరి భావాలు ఒక్కటై, ఇరువురు సహజీవనం చేయసాగారు.ఒకరోజు సడెన్ గా ఆ జీవితం చాలా ఉక్కపోతగా,అంతకంటే ఎక్కువ రొటీన్ గా అనిపించింది.ఇలాంటి జీవితం నుంచి బంధ విముక్తి కావాలని దృఢంగా నిశ్చయించుకొని, మాకు ఇక్కడ పనిచేయడం ఇష్టం లేదు,మా సర్టిఫికేట్లు మాకు ఇచ్చేయండి,మేం వెళ్ళి పోతాం అనీ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసారు.దానికి యాజమాన్యం మీరు బాండ్ రాసిచ్చారు.ఆ బాండ్ పూర్తయ్యేవరకు మీరు పనిచేయక తప్పదు అనీ నిక్కచ్చిగా చెప్పారు.ఏం చేయాలో అర్థం కాలేదు,ఆ రొటీన్ జాబ్ చేయడం లేక ఒక రాత్రికి రాత్రి ఇద్దరూ ఆ స్కూల్ గోడ దూకి వెళ్ళిపోయారు.సర్టిఫికెట్స్ ఆ స్కూల్
యాజమాన్యం ఉండిపోయాయి... కట్ చేస్తే...
                      కడప జిల్లా కేంద్రంలో స్వంతంగా ఒక స్కూల్ ప్రారంభించారు.కొన్ని రోజులు నడిపించారు.ఆ తరువాత అది వాళ్ళ కప్ ఆఫ్ టీ కాదని నిర్ణయానికి
వచ్చారు.స్కూలును వేరేవాళ్ళకు అమ్మేసారు.ఆ తరువాత లోహి కొన్ని రోజులు ఛత్తీస్గఢ్ లోని దంతెవాడ లో ఒక స్కూల్ లో పనిచేసేవాడు,అప్పుడు జయతి నర్సీపట్నం ఉండేది.శని, ఆదివారాలు లోహి
బైక్ మీద దట్టమైన అడవుల్లో ప్రయాణించి, నర్సీపట్నం
చేరుకునేవాడు.ఈ ప్రయాణాల వల్ల ఇద్దరూ చాలా ఇబ్బందులు పడ్డారు.అలా కుదరదని లోహి జాబ్ మానేసి నర్సీపట్నం మకాం మార్చేసాడు.అక్కడి నుంచి
వెళ్లి కొన్ని రోజులు విజయనగరం ఉన్నారు.వాళ్ళిద్దరూ కలిసి చేసిన రెండు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర అత్యంత సాహసోపేతమైనది.లోహి,ఆ యాత్ర అనుభవాలను బైసికిల్ డైరీస్ అనే పేరుతో ఇంగ్లీషు లో
ఒక పుస్తకం కూడా రాసాడు.ఆ తరువాత వాళ్ళిద్దరూ
కొండలు,గుట్టలు,లోయలు ఉండే అటవీ ప్రాంతంలో నివసించేందుకు నిశ్చయించుకున్నారు.అలా అనీ వాళ్ళు ప్రకృతి ప్రేమికులు కాదు.మేమూ ఈ ప్రకృతిలో
ఒక భాగమే అంటారు.వాళ్ళు ఉండే ప్రదేశాలు
జనావాసాలకు దూరంగా ఎక్కడో అడవుల్లో ఒంటరి జీవితం గడుపుతున్నారు.ఒంటరి జీవితం అంటే చుట్టూ ఎవరూ ఉండరని కాదు.వాళ్ళకు తోడుగా అందమైన ప్రకృతి, దానిలో రంగు రంగుల సీతాకోక చిలుకలు, ఎన్నో రకాల రెక్కల పురుగులు, సూక్ష్మజీవులు, పాములు, తేళ్ళు,అడవి పందులు, ఎలుకలు ఇలా ఒకటేమిటి అనేక రకాల మూగ జీవుల
సాంగత్యమే కాకుండా వాళ్ళకు అత్యంత ఇష్టమైన, చిన్నప్పటి నుంచి పెంచుకున్న వైటీ( కుక్క) ... కుళ్ళు, కుతంత్రాలతో కూడిన మనుషుల కంటే కల్మషం ఎరుగని ఈ మూగ జీవులే నయం.అవును మన మనసులను తొలిచే ఒక ప్రశ్నను వెంటనే అడిగేయాలనిపిస్తుంది... అలాంటి ప్రదేశాలలో ఎలా ఉంటారు..భయం వేయదా అనీ,భయం ఒకరోజో,ఒక వారం రోజులో, లేకపోతే ఒక నెల రోజులో ఉంటుంది.
రోజూ వాటి తోనే జీవిస్తుంటే ఇంక ఆ సమస్య ఎందుకుంటుంది.. అంటాడు లోహి.మేమూ ప్రకృతిలో
భాగమే.ఆ మూగ జీవాలతో పాటే,మేమూ మాట్లాడే జీవులం అంటాడు లోహి.అడవుల్లో ఉంటున్నారు అన్న
మాట వింటేనే వళ్ళు జలదరిస్తుంది.అలాంటిది వాళ్ళు అక్కడే ఏళ్ళుగా నివసించడం అంటే సాహసోపేతమే.
అర్థరాత్రి ఉరుముల మెరుపులతో భారీ వర్షం ఉలిక్కిపడి లేచారు ఇద్దరూ.లోహి తమ ప్రాణానికి ప్రాణమైన వైటీ వర్షంలో తడవకుండా సురక్షిత స్థలానికి
తరలించాడు.జయతి వంట కట్టెలు తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.అక్కడ వాళ్ళు రోజు కట్టెల పొయ్యి మీదనే వండుకుంటారు.కరెంట్ ఉండదు. ఇప్పుడిప్పుడే సోలార్ పవర్ ను వాడుతున్నారు,అదీ
సెల్ ఫోన్లు చార్జ్ చేసుకోవడానికే.నెలకు వాళ్ళిద్దరికీ
మూడు వేల రూపాయల ఖర్చు.ఇప్పుడు వైటీ పెద్దదైంది కాబట్టి దాని ఖర్చు ఇంకో వేయి రూపాయలతో కలిపి నెలకు నాలుగు వేల రూపాయలు
ఖర్చు.వాళ్ళిద్దరి మొత్తం లగేజ్ రెండు బ్యాగులు మాత్రమే.వాళ్ళ దినచర్య ఉదయం మూడున్నరకు మొదలవుతుంది.సాయంత్రం అయిదున్నరకు డిన్నర్
పూర్తిచేసి, ఏడున్నరకు నిద్రపోతారు.... అర్థరాత్రి కురిసిన భారీ వర్షం తగ్గింది.నేలంతా తడిచిపోయి మిణుగురు పురుగులు భూమి లోనుంచి బయటకు 
వచ్చి చిమ్మ చీకట్లో వెలుగుతూ నేలపై పారుతుంటే అద్భుత దృశ్యం...కట్ చేస్తే...
                     జయతి మంచి ఫోటో గ్రాఫర్.వైల్డ్ లైఫ్
 ఫోటోలు తీసి,వాటికి పోయటిక్ పదజాలంతో అద్భుతంగా రైటప్ రాస్తారు.అడవి జీవితానుభవాలను
వివరించుకుంటూ ఇప్పటికే ఆమే మూడు పుస్తకాలు
వెలువరించారు.అవి అడవిలో నుంచి అడవిలోకి,
మనం కలుసుకున్న సమయాలు,అడవి పుస్తకం,
నాలుగవ పుస్తకం ఈరోజు ఆవిష్కరించిన దిమ్మరి...
ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలి, వారిలో ప్రముఖ కవి, రచయిత అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత వాడ్రేవు చిన వీరభద్రుడు
గారు,ఇంకొకరు మిర్యాలగూడ, ఆల్లగడపకు చెందిన
మట్టి మనుషులు పబ్లిషర్,మట్టి మనిషి వేనెపల్లి పాండురంగారావు గారు... వీళ్ళిద్దరి గురించి కొంచెం మాట్లాడుకొని దిమ్మరి ఆవిష్కరణ కార్యక్రమం గురించి
రాస్తాను....
                                     
కామెంట్‌లు