కృష్ణాష్టమి- గాజుల నరసింహ-9177071129
అష్టమి నాడు పుట్టిన వెన్నెదొంగకు నేడు పుట్టినరోజు
కనుకే నేటి అష్టమిని కృష్ణాష్టమి అని అందురు
చేరసాలలో పుట్టిన ఏమిదోవ సంతానం
కారణ జన్ముడై పుట్టిన అవతారం కృష్ణావతారం
లోక పీడుతులైన అసురులను వధించి
లోకాన్ని సుభిక్షం చేయడానికి నారాయణుడు
ఈ లోకాన ఎత్తిన జన్మ కృష్ణావతారం

అల్లరిగా తిరుగుతూ వెన్న పాలు దొంగలించి తింటూ
పడచు కన్యలతో పరాచకాలు ఆడుతూ
తన మాయ లీలలతో అందరి కష్టాలను తీర్చుతూ
గోవులు కాస్తూ శరణా గతులైన వారిని రక్షిస్తూ
చెడ్డవారికి తన చిలిపితనంతోనే బుద్ధులు చెప్పుతూ
తానున్న చుట్టు ముట్టు ప్రాంతాలను కాపాడేవాడు
కృష్ణుడు నల్లని వాడైనా అల్లరివాడైనా
ఎప్పుడూ తాను అందరివాడే అందరికోసం తాను వున్నా వాడే..
ధర్మ పక్షపాతి  ఉపాయ0 గల నేర్పరి తను
అభయంబు నొసుగు భగవంతుడు తాను

కామెంట్‌లు