ఆధ్యాత్మిక మణిపూసలు;- మమత ఐల-కరీంనగర్-9247593432
గజేంద్ర మోక్షం (161 నుండి 170)
==========================
ధర్మ కుండ నిండి పోయె
ప్రాణ శక్తి తగ్గి పోయె
పిలుపునున్న మహత్యము
కిరణం వలె సాగిపోయె

ఎవరు శాంతమూర్తి మరి
ఎవరు క్రోధ మూర్తి మరి
ఎవరి చేత ఈ జగము
జనింపబడినదో మరి

మహా ప్రళయ శక్తి అంత
లీనమయేదెవరి చెంత
ఎవరు నిరంతరము నుందు
కాపాడునొ విశ్వ మంత

సచ్చిదానందుడెవరో
ఆ భగవంతుండెవరో
జనన మరణమే లేని
సర్వ స్వరూపమెవరో 

వికారాల కతీతుడు
స్ర్తీ పురుషుడు గాడతడు
ఒక్కడుగా ప్రకాశించె
దేశ కాలపతీతుడు

జీవుల సుఖ దుఃఖాలను
సమస్త జీవ కర్మలను
తెలిసిన ఆ సర్వజ్ఞుడు
రక్షించ బూన వలెననెను

దయ చూపించే వాడట
దీనుల యోగులపై నట
ఎవరో ఆ ఒక్కడు మరి
కరి వేదన గనుమనెనట

వెలుగులు విరజమ్ము  నతడు
సర్వ వ్యాప్తమై  ఇతడు
ఎల్ల వేల ప్రకాశించి
దీనుల రక్షించు విభుడు 

అట్టి పరంజ్యోతుడు
రావాలనుచు ఇప్పుడు
తీక్షణముగ వేడెనట
కన్నీటితొ గజేంద్రుడు

ఆ ఒక్కడు పరమాత్ముడె
విన్నంతనె వచ్చుచుండె
ఆ పిలుపు తన కొరకని
తక్షణాన వెడలుచుండె


కామెంట్‌లు