గజేంద్ర మోక్షం (111 నుండి 120 )
========================
దంతాలతో గ్రుచ్చినను
తోండముతో విసిరేయను
క్రోధం హెచ్చగ దుముకుచు
వీపు నంత కొరికేసెను
గట్టెక్కుతె దొరకదని
పట్టు విడిన జారునని
దొరికిన చోటును కొరుకుచు
కదలనీదు గజమ్ముని
రణము నాపనీయదు
గట్టునెక్క నీయదు
గజరాజు బలము నంత
చూపినగని విడువదు
కరి కాయము చింపుచు
కండలన్ని కొరుకుచు
బలహీనుని జేసెను
అడ్డమడ్డమచ్చుచు
దంతం వీపున దిగిన
విసిరేయ నింగికెగిరిన
బలం పుంజుకోని వచ్చు
జల జీవి అయినందున
నీటి బలము మకరముకు
ఎక్కువని గజరాజుకు
తెలిసి గట్టు నెక్క జూడ
దారీయదు గజమ్ముకు
కరి బలము జిక్కి కృంగ
పిల్ల మొసలులంత మింగ
కండలన్ని తరిగెను
పోరు బలము తగ్గంగ
మరణించుట తథ్యమిక
ప్రాణం మిగిలున్నదిక
పూర్వ జన్మ గుర్తులు
సత్వ గుణము చూపెనిక
రజో గుణము సమసిపోయె
సత్వ గుణము వికసితమయె
ఆత్మ జ్యోతి కనిపించగ
దైవమెవరొ తెలిసి పోయె
నాటి జన్మ జ్ఞాపకాలు
నేటి మోక్ష మూలకాలు
దీక్ష తోడ ధ్యాన్నించగ
ఆనాటివట ఫలితాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి