హరివిల్లు రచనలు,; -కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 196
🦚🦚🦚🦚
గంగమ్మ ఒడిలో చేరి
చల్లంగ బతుకమ్మా....!
ఏడాది పాటు చక్కగా 
మమ్ము బ్రతికించవమ్మా‌.‌‌..!!
🦚🦚🦚🦚
హరివిల్లు 197
🦚🦚🦚🦚 
సంకల్ప దీక్షలు
పెంచును గోరక్షణలు‌‌.‌..!
కర్తవ్య బోధనలు
అరికట్టును గోవధలు‌....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 198
🦚🦚🦚🦚
మోచేతి నీటి ధారలు
తీరునా దాహాలు......!
ఈ రీతి కాపురాలు
కలుగునా సంతానాలు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 199
🦚🦚🦚🦚 
పైన కారు మబ్బులా 
కనిపించు ఓ మేఘమా...!
నేలపై కురిపించవే
కాలామృత వర్షమా.....!!
 🦚🦚🦚🦚
హరివిల్లు 200
🦚🦚🦚🦚 
కనిపించని జలధారలు
ఎగువ పయన ప్రవాహం....!
ఫలితమిచ్చును చెట్ల
ఫలాలలో ముదావహం.....!!

                       (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు