హరివిల్లు రచనలు,; -కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 206
🦚🦚🦚🦚
నాకు తెలియదనుచు
కాలయాపన చేయకు...!
నాకు తెలుసుకదా అనుచు
సమయ పాలన మానకు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 207
🦚🦚🦚🦚 
మేజర్లను జీ హుజూర్
అని పొగుడుట రివాజు.....!
హుజూరాబాద్ ఓట్లను
నోట్ల త్రాసున బేరీజు.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 208
🦚🦚🦚🦚
కోట్ల ధర పలికిన వర్ణ
చిత్ర చిత్రకారుడు.......!
భూపేన్ ఖఖర్! ఎవరో
కాదు మన భారతీయుడు..!!
🦚🦚🦚🦚
హరివిల్లు 209
🦚🦚🦚🦚 
బొగ్గు, కణికై బూడిదగ
అగు వరకు వేచి చూడకు...!
సదుపయోగం నేర్చుకో
కాలమాగదు మన కొరకు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 210
🦚🦚🦚🦚 
పైరవీల దారి కన్న
మంచి దారి దొరుకుతుంది...!
పగ అసూయ విడనాడిన
ధర్మ దారి పిలుస్తుంది..........!!
                       (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు