ప్రయత్నం - సాధన (బాల గేయం);- రావిపల్లి వాసుదేవరావు-విజయనగరం-9441713136
జవాబు రాబట్టుటకై
సూటిగ ప్రశ్నించవలెను!
ఫలితమును పొందుటకై
కష్టమునే నమ్మవలెను!

ఉన్నతి సాధించుటకై
ప్రయత్నములు చేయవలెను!
ప్రగతిన పయనించుటకై
మంచిదారి ఎంచవలెను!

లక్ష్యం నెరవేరుటకై
సాధన సాగించవలెను!
జగతి పురోగతి కోసం
జనత శ్రమించవలెను!

ఐక్యత సాధించుటకై
సఖ్యతతో ఉండవలెను!
సమతా మమతల కోసం
ప్రేమలు పూయించవలెను!
కామెంట్‌లు