ప్రధమ జ్ఞాన పీఠ బహుమతి గ్రహీత;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం9492811322.

 ఆకాశవాణిలో సాహిత్య కార్యక్రమాలు ఏవి జరిగినా ప్రత్యేకించి విశ్వనాథ వారు  తప్పక హాజరు కావలసినదే.  ప్రత్యేక సందర్భాలలో కవితా గోష్ఠి లను ఏర్పాటు చేస్తుంది ఆకాశవాణి  ఎప్పుడు ఆ కార్యక్రమానికి నా దానికి తప్పకుండా  సత్యనారాయణ గారే అధ్యక్షులుగా కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు  ఆరుబయల కార్యక్రమలు జరుగుతూ ఉన్నప్పుడు  శ్రీ శ్రీ డాక్టర్ సి.నారాయణరెడ్డి మదునా పంతుల సత్యనారాయణ  లాంటి మేధావులతో పాటు మొదటిసారిగా  దాశరధి గారు కూడా వచ్చారు  విశ్వనాథ వారు అంతకుముందు దాసరధిని చూడలేదు  వారి కవితలు కూడా వారు  చదవలేదు  ఆయన హైదరాబాదుకే పరిమితమైన కవిగా  అందరి మనసులలో ఉన్న అభిప్రాయం. జాషువా గారు కవిత చదివిన తర్వాత  దాశరధి గారిని  పిలిచారు  వారి ఆకారాన్ని చూసి మా నిర్వాహకులను  ఏరా అసలే పొట్టి వాడు వాడికి మైకు అందదు  ఒక చిన్న ఎత్తుపీట వేయండి రా  అన్న తర్వాత ఆ ఏర్పాట్లు జరిగాయి  దాశరధి గారు వ్రాయడంలో ఎంత  గొప్ప శైలిని ప్రదర్శిస్తారో  చదివే పద్ధతిలో కూడా  నాటకీయత కనిపిస్తుంది  కవిత ఎలా చదవాలో  తెలియజేసే పద్ధతిలో చదువుతారు. వీడు పొట్టివాడైనా చాలా గట్టివాడేరా  అని ప్రశంసించారు వారు చదివిన తర్వాత విశ్వనాథ సత్య నారాయణ గారు  వీడు ముందు ముందు మరిన్ని అద్భుతమైన రచనలను  చేస్తాడు  అని భవిష్యత్తును చెప్పినవాడు. విశ్వనాథ వారి నోటి వెంట వచ్చిన ఏ వాక్యం కూడా అమలు కాకుండా ఉండదు  అలాగే గొప్ప కవిగా దాశరధి గారు అందరి గుండెల్లో దాగి ఉన్నారు.
అలాగే అవధాన కార్యక్రమాలు ఏమి జరిగినా  దానికి అధ్యక్షనిగా  విశ్వనాథ వారే వ్యవహరిస్తాయి  వారి దగ్గర శిష్యుడుగా  పనిచేసిన భరత శర్మ గారు అవధానం చేస్తున్న కార్యక్రమానికి కూడా వారు హాజరయ్యారు  ఎనిమిది మంది  మేధావులను  సంతృప్తి పరచడం   అవదాన్ని  బాధ్యత  మెదడును ఎనిమిది భాగాలు చేసుకుని వారు చెప్పిన విషయాలను 8 గా విభజించుకొని  కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత మొత్తాన్ని  ప్రేక్షకులకు జ్ఞాపకం చేయాలి  దానిలో ఏ ఒక్క అక్షరాన్ని మర్చిపోకూడదు  చివరిగా విశ్వనాథ సత్యనారాయణ గారు  దానిలో పాల్గొన్న  ప్రుచ్చకులను  అవధానిని  అభినందించి  వారి వారి సుగుణాలను చెప్పడంతో  కార్యక్రమం ముగుస్తుంది.

కామెంట్‌లు