మనం గీతా సిద్ధాంతం తెలుసుకోవాలనుకుంటే భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలను మూడు భాగాలుగా విభజించి మొదట కర్మ గురించి చెప్పి ఆ తర్వాత జ్ఞానాన్ని గురించి భక్తిని గురించి తెలియజేశారు. ఏ వ్యక్తికైనా తాను చేయవలసిన విధులు కొన్ని ఉంటాయి ఆ విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఏ కర్మలను చేయవలెనో వాటిని మాత్రమే చెయ్యడం తర్వాత ఎందుకు చేయాలి దాని వల్ల ప్రయోజనం ఏమిటి అన్న విషయాల్ని గురించి ఆలోచించుకుని పెద్దల ద్వారా తెలుసుకొని చివర భక్తి మార్గంలోకి వెళ్లాలి భక్తి అంటే ఏదో ఒక దేవుని పటం పెట్టుకుని పూజలు చేయడం కాదు ఏ పని చేశావో తెలుసుకుని దానిని పూర్తిగా చేయడానికి అంకితభావంతో చేయాలి అని చెప్పడం అప్పుడు ఆ పనికి ఫలితం లభిస్తుంది అని శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు.
కర్మ చేయడం వల్ల తన ధర్మాలు ఏమిటో ఏ ధర్మాన్ని ఎలా నిర్వహించాలో ఆ ధర్మాన్ని నిర్వహించడం వల్ల వచ్చే ఫలితం ఎంతో దానిని సక్రమంగా చేయడానికి ఎలాంటి వారి సలహాలను స్వీకరించాలో ఆలోచించి దానికి తగిన వ్యక్తులను నిర్ణయించుకొని వారి ద్వారా సక్రమమైన పద్ధతిని గనక తెలుసుకున్నట్లయితే దానిలో మనకు ఎన్నో ధర్మాలు వస్తాయి ప్రతి ధర్మము ఆచరించవలసిన అవసరం లేదు చేయవలసిన విధులు ఏవైతే ఉంటాయో ఆ ధర్మాన్ని మాత్రమే మనం చేసి తీరాలి అనవసరమైన వాటి జోలికి వెళ్లి దాని పద్ధతి ఏమిటో తెలియకుండా అవి ఎందుకు చేయవలసి వస్తుందో కూడా అర్థం చేసుకోకుండా అయితే చెడు ఫలితాలు తప్ప మంచి అతని జీవితానికి చేరదు అని వేమన మనకు తెలియజేస్తున్నాడు. అలా అని ధర్మము కర్మము అని కూర్చున్నట్లయితే నీకు రావలసిన ఫలితం సక్రమంగా రాదు విషయ పరిజ్ఞానం మాత్రమే ఈ క్షణం వరకు నీకు తెలిసినది కార్యరూపంలో అది ఆచరణ చేయడానికి ఎన్ని కష్టాలు పడవలసి వస్తుందో అవన్నీ అనుకోకూడదు వాటన్నిటిని తెలుసుకొని తీరాలి ఏదైనా నది తీరానికి కానీ చెరువు దగ్గరకు కానీ వెళ్లి చూసి దాని లోతు గురించి ఆలోచించినట్లయితే దాని ఫలితం ఏమిటో నీకు అర్థం అవుతుందా నిజంగా దాని లోతు తెలుసుకోవాలని నేను అనుకున్నప్పుడు తప్పకుండా ఆ చెరువులో కానీ నదిలో గాని దిగి తీరాలి అప్పుడు ప్రత్యక్షంగా నీకు అర్థమవుతుంది ఇక్కడ మోక్ష విషయం కూడా ప్రత్యక్షంగా నీవు దానిలో లీనమై చేస్తే తప్ప ఫలితం దొరకదు
అంటున్నాడు వేమన ఆ పద్యాన్ని చదవండి.
"కర్మమయుడు గాక ధర్మంబు దెలియదు కర్మజీవి మేలు గాన లేడు నీరు జొరక లోతు నియాన తెలియదు..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి