ఉక్కు మనిషి కాకాని ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 కాకాని వెంకటరత్నం గారి జీవితాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే స్వార్థపూరిత రాజకీయాలకు ఎంతో దూరంగా ఉంటూ  ప్రజల క్షేమాన్ని సంక్షేమాన్ని కోరుకుంటూ  సమాజానికి సేవ చేయడం కోసం  విద్య వైద్య సదుపాయాలు ముఖ్యం అని భావించి  జీవితాన్ని ఆదర్శప్రాయంగా గడిపిన వాడు  స్వాతంత్ర్య సముపార్జన కోసం  డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి డాక్టర్ మరుపూరు కోదండరామిరెడ్డి  ఆరుమళ్ళ సుబ్బారెడ్డిలతో సమత్వానంద్ కలిసి జీవితాన్ని  కొంత భాగాన్ని జైలులో గడిపారు  ఆ సమయంలో అక్కడ కూడా బ్రిటిష్ వారిని  లొంగదీయడానికే ప్రయత్నం చేశారు తప్ప వీరు ఎప్పుడు లొంగిపోయిన  సందర్భాలు లేవు  వారికి ప్రత్యేకంగా ఒక  కారు ఉండేది దానిని చూడగానే కాకాని గారు వస్తున్నారు అని అందరికీ తెలిసిపోతుంది. ఆకునూరులో జన్మించిన కాకాని వెంకటరత్నం గారు  1969 వ సంవత్సరంలో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జరిగిన  ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు  రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు  జీవితంలో ఆయనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయ శాఖను  తీసుకొని వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులను తీసుకువచ్చారు  రైతులందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ  వారి కష్టాలను నష్టాలను వింటూ దానికి కావలసిన ఏర్పాట్లను చేస్తూ  తాను కూడా వ్యవసాయదారునిగా ఆలోచించి దానికి కావాల్సిన  అవసరాలన్నిటిని తీర్చినవాడు  ముఖ్యమంత్రి మన్ననలను కూడా పొందినవాడు  స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి ముదునూరులో  ఉపాధ్యాయ వ్యవస్థలో ఉన్న నాగులపల్లి సీతారామయ్య గారు వీరికి కుడి భుజం  ప్రకాశ రావు గారు ఎడమ భుజం  కాకాని గారు ఏ కార్యక్రమాలు ప్రారంభించాలని అనుకున్నా దానిని ముందు వీరిద్దరితోనూ సంప్రదించి  దానిలో మంచి చెడులను ఆలోచించి  ప్రజలకు అది సహాయకారిగా ఉంటుందా లేదా అన్న నిర్ణయం  తీసుకున్న తర్వాత కానీ తన అభిప్రాయాన్ని  చెప్పేవాడు కాదు  ఒకరోజు తేలప్రోలు వచ్చి సుబ్బారెడ్డి గారిని కలిసి పెద్దవాడు ఏం చేస్తున్నాడు అని అడిగితే  పొలంలో ఉన్నాడని చెప్పగానే  తన కారును పంపి  వారి అబ్బాయి  కోటి రెడ్డిని తీసుకువచ్చి వెంటనే మద్రాస్ లో శిక్షణ ఇప్పించి ఆ తర్వాత తేలప్రోలు గ్రామంలోనే  ఆయనను డ్రిల్ మాస్టర్ గా ఉద్యోగం ఏర్పాటు చేశారు  అలా ఎన్ని పనులు చేశారో చెప్పడం కష్టం.

కామెంట్‌లు