:*గుడి లేని దైవం గురువు*;- షేక్ అస్మతున్నీసా. తెలుగు టీచర్, తెనాలి మండలం, గుంటూరు జిల్లా . చరవాణి: 9550898059.

 దరికి చేరి, దారి చూపి,/
దిశా నిర్దేశాన్ని తెలియ జెప్పి,/
 దిక్సూచిలా సహకారాన్నందించి/
 ప్రతీ విద్యార్థి ప్రగతికి ఓ సోపానంలా,
సాధనంలా మలచబడి,/ 
సుఖాల సౌధానికి నిను చేరువ చేసే
 సత్యశీలుడే గురువు./ 
సుశీలుడు, సుశిక్షితుడు, సంరక్షకుడు. /
అజ్ఞాన తిమిరాన్ని అధిగమించేలా,/ 
అధోలోకానికి నువు అణచబడకుండా ఆదుకుంటూ,/
అన్నివేళలా ఆదర్శాన్ని అంతటా నింపుతూ,/
 విద్యా వ్యవసాయాన్ని చేసే కృషీవలుడు
 మన ఉపాధ్యాయుడు. /
ఓ వృత్తిలా, ఉపాధిలా కాక,అంకిత భావంతో ఆచరణాత్మకంగా కొనసాగే కర్షకుడు. /
గురువు లేని స్థలం లేదు.
చదువు లేని స్థానం మనలేదు./
 రాజులైనా , వీరభోజులైనా విద్యలేక ఉన్నతి లేదు./
 నిత్యవిద్యార్థిలా నిరంతరం అధ్యయనం చేస్తూ,
అభ్యసనాలను నేర్పిస్తూ,/
 నైతిక విలువలను, సమాజ పోకడలను/ 
సమయస్ఫూర్తితో నీలో చొప్పిస్తూ,/
క్రమశిక్షణను కఠినంగా అమలు పరుస్తూ,/ 
ఆచార్యునిలా ఆదేశాలనిస్తూ,/ 
ఆవేశాలను అదుపు చేస్తూ,/
 ఆత్మ బంధువులా అక్కున జేర్చుకుంటూ,/ 
అక్షర సేద్యం చేస్తున్న అమరుడు, మన
గురువర్యుడు./
కఠిన శిలను కమనీయ శిల్పంలా మలిచే/ మహానీయుడు, మహాఋషి తుల్యుడు. తల్లిదండ్రులను మరిపించి, తోడుగా, నిలిచే నిజనేస్తం గురువు. సంజీవనిని సైతం ఎఱుక పరిచేవాడు గురువు. త్రిమూర్తులను మించిన త్రికాల జ్ఞాని గురువు. నిలువెత్తు విజ్ఞాన భాండాగారం గురువు. నిత్యం నేలపై నడయాడే స్వయంభూ గురువు. అన్నిటినీ మించి సాక్షాత్ ఆ భగవత్స్వరూపుడే "మన గురువు. 
ఈ కవిత నాదేనని హామీ ఇస్తూ..
          
కామెంట్‌లు