వందనము వ్రాతపతి!
ప్రమధాది గణపతి!
ఏకదంత! సురపతి!
నమోనమో గణపతి!
( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
👌శ్రీమహా గణపతి స్వామివారు.. సకల విద్యలు, వ్రాతలు, ప్రణాళికా రచనలు.. మున్నగువాటికి అధిపతి! ప్రమధాది గణములకు ప్రభువు! దేవతలు, దానవులు మానవులు . మున్నగు వారందరికీ.. పరిపాలకుడు .. ఏక దంతుడు!
👌సకల శుభఫల ప్రదాత యైన, శ్రీమహా గణపతి దేవుని మనమంతా భక్తి ప్రపత్తులతో.. ధ్యానించాలి! రెండు చేతులు జోడించి నమస్కరించాలి!
మనమహర్షులు శ్రీస్వామి వారిని... "శ్రీ గణపతి అధర్వ శీర్ష ఉపనిషత్తు" నందు.. ఈ విధంగా ప్రస్తుతించారు!
🪷 ఓం నమో వ్రాతపతయే!
నమో గణపతయే!
నమః ప్రమథ పతయే!
నమస్తే అస్తు లంబోదరాయ !
ఏక దంతాయ!
విఘ్న నాశినే!
శివ సుతాయ!
శ్రీవరద మూర్తయే నమః!
( శ్రీమహా గణాధిపతి మంత్రమాలిక )
🚩తేటగీతి పద్యము
మ్రొక్కెదను వ్రాతపతికి లంబోదరునికి
వరదమూర్తికి ప్రణతులు ప్రమథపతికి
భువిని ఏకదంతునికిని శివసుతునికి
నతులు గణపతికివె విఘ్ననాశకునికి
మంత్రమాలికన్ భక్తితో మది దలంతు!!
[ అవధాని, కోట రాజశేఖర్., ]
ఓం గం గణపతయే నమః !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి